ఘనంగా ముగిసిన జగన్ చివరి రోజు పాదయాత్ర

Spread the love

ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఇచ్ఛాపురం నిజానికి ఓ చిన్న పట్టణం. అక్కడి జనాభా మహా అయితే వేలల్లోనే ఉంటుంది. కానీ రెండు రోజులుగా అక్కడ సందడే సందడి.అక్కడే 341 రోజులుగా 3,656 కిలోమీటర్ల మేర సాగిన తన యాత్రను ఆయన ముగిస్తారు.

ఈ సభను భారీఎత్తున విజయవంతం చేయడం కోసం ఇప్పటికే ఆ పార్టీ కీలక నేతలంతా మంగళవారం రాత్రి ఇచ్ఛాపురం చేరుకున్నారు.పాదయాత్రతో జగన్‌ జనహృదయాలను గెలుచుకున్నారనేది అందరి మాట. ఇచ్ఛాపురానికి భారీగా చేరుకుంటున్న యువత రాష్ట్రంలో నవశకం మొదలు కానుందని చెబుతున్నారు.

పన్నెండేళ్ల కొచ్చే పుష్కరాలు.. ఎప్పుడో వచ్చే జాతరలో జనం ఏ స్థాయిలో ఉత్సాహంగా కనిపిస్తారో.. అంతకన్నా రెట్టింపు సన్నివేశం ఇచ్ఛాపురంలో కనిపిస్తోంది. బైపాస్‌ రోడ్డు మీద నుంచే కనిపించే పాదయాత్ర పైలాన్‌ను వాహనాల్లోంచి చూస్తూ అభిమానులందరూ సంబరపడిపోతున్నారు.పాదయాత్రకు గుర్తుగా ఇచ్ఛాపురంలో నిర్మిస్తున్న పైలాన్‌కు గెలాక్సీ గ్రానైట్‌ వాడారు. రూ. రెండు కోట్లను ఈ నిర్మాణం కోసం వెచ్చించారు.

గతంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన కుమార్తె షర్మిల చేపట్టిన పాదయాత్ర, ఇప్పుడు జగన్‌ పాదయాత్ర కలిపి మొత్తం ముగ్గురి పాదయాత్రలు గుర్తుకు వచ్చేలా ప్రజాప్రస్థాన ప్రాంగణాన్ని నిర్మించారు. మొత్తం నాలుగు పిల్లర్లపై మూడు అంతస్తులో ఈ స్థూపం నిర్మాణం జరిగింది. మొదటి అంతస్తులోలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ఫొటో, రెండో అంతస్తులో వైఎస్‌ ఫొటోను ఉంచారు.


Spread the love