యాత్ర లో విజయమ్మ ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్రబృందం

Spread the love

మన వాళ్ళు ఏది క్లిక్ ఐతే అదే ఫాలో అయిపోతుంటారు. అలాగే ఈ బయోపిక్స్ కూడా మహానటి సినిమా విజయం తరువాత అందరి దర్శకుల కన్ను బయోపిక్స్ మీద పడింది. చెప్పాలంటే మహనీయుల జీవిత చరిత్ర నుంచి చాలానే నేర్చుకోవచ్చు. అదే తరుణం లో నందమూరి తారక రామ రావు గారి బయోపిక్ కూడా రెండు భాగాల్లో విడుదల చేస్తున్నారు.దానికి మొదలు ఇంకా మన భారత దేశ సినీ పరిశ్రమ మొత్తం బయోపిక్స్ మీద ఆసక్తి చూపుతుంది. స్వర్గీయ జయలలిత గారి బైయోపిక్ లో నిత్యా మీనన్ జయలలిత గారి పాత్రను నటిస్తుంది.

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ కూడా ఈ నెల 11 న విడుదల కాబోతుంది. నరేంద్ర మోడీ గారి బయోపిక్ కూడా తెరకి ఎక్కబోతుంది.దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ..గారి జీవిత చరిత్ర కూడా నిర్మాణం లో ఉంది . ఆ సినిమా లో పాత్రలకి తగ్గట్టు నటి నటుల్ని ఎంచుకొని అందరిని ఆకర్షిస్తున్నారు.

 

రాజా రెడ్డి పాత్ర లో జగపతి బాబు , రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో మమ్ముట్టి గారిని ఎంచుకున్నారు. విజయమ్మ పాత్ర లో బాహుబలి-2 లో నటించిన అశ్రిత ని ఎంచుకున్నట్లు గా ఒక పోస్టర్ ని విడుదల చేసారు. ఐతే విజయమ్మ పాత్రలో అశ్రిత చాల చక్కగా సరిపోయింది అనే చెప్పాలి . ఈ పోస్టర్ చూస్తే మీకే అర్ధం అవుతుంది.


Spread the love