విడుదలకి సిద్దంగా ఉన్న ప్రభాస్ సాహో సినిమా

Spread the love

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’.. రన్ రాజా రన్ ఫేం సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు..బాహుబలి చారిత్రాత్మ‌క విజ‌యం తరువాత ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావ‌డంతో సాహో సినిమా పైన దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ‘సాహో’ రిలీజ్ ఎప్పుడు అనే దానిపై ర‌క‌ర‌కాల వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి కానీ.. చిత్ర యూనిట్ మాత్రం అఫిషియ‌ల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ చేయ‌లేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…

ఈ సినిమాను 2019 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దేశ విదేశాల్లో భారీ ఎత్తున చిత్రీకరించిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయ‌నున్నారు.

UV క్రియేష‌న్స్ సంస్థ ఎన్నో అద్భుత విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల విడుదలై ఈ సినిమా మేకింగ్‌ వీడియోకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ రావటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులతో సహా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తోంది..


Spread the love