విజయ్ దేవరకొండ ” టాక్సీవాలా ” రివ్యూ & రేటింగ్

Spread the love

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ టాక్సీవాలా వరుసగా వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇవాళ థియేటర్లలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. నోటా చిత్రంతో ఫ్లాప్ మూటగట్టుకున్న ఈ హీరో టాక్సీవాలా చిత్రంపై భారీ నమ్మకాలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే పైరసీ బారిన పడటంతో ఈ సినిమా విజయంపై పలు అనుమానాలు రేకెత్తాయి. కానీ ప్రేక్షకులు తమవెంట ఉన్నారని ధీమాగా చెబుతున్నారు చిత్ర యూనిట్. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ అనుకున్నట్లు విజయం అందుకున్నాడో లేదో రివ్యూలో చూద్దాం.వరుస విజయాలతో దూసుకెళుతున్న విజయ్ దేవరకొండ చేసిన ఒక డిఫరెంట్ సినిమాగా టాక్సీవాలా నిలిచిపోతుంది.

ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌ను దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ తనదైన మార్క్‌తో తెరకెక్కించిన విధానం నేటితరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అయితే పూర్తిగా దెయ్యం కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా యూత్‌ను అలరించడంలో ఫెయిల్ అయ్యిందనే చెప్పొచ్చు.

ఫస్టాఫ్ మొత్తం హీరో ఉద్యోగం లేక సతమతమవుతూ, ఏదైనా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని చూసి తక్కువ ధరకు వచ్చిందని ఒక వింటేజ్ కారును కొని ఎలా తిప్పలు పడతాడు అనేది చూపించారు. కారులో దెయ్యం ఉందని తెలుసుకున్న హీరో ఆ తరువాత దానితో స్నేహం చేయాలని ప్రయత్నిస్తాడు.

ఈ క్రమంలో హీరో మరియు అతడి స్నేహితులతో నడిచే కామెడీ ట్రాక్ సినిమాకు పెద్ద బూస్ట్ అని చెప్పాలి. హీరోయిన్ ప్రియాంక జావల్కర్‌‌తో హీరో లవ్ ట్రాక్ అస్సలు బాగాలేదు. హీరోకు షాక్ ఇస్తూ ఒక కస్టమర్‌ను చంపుతుంది కారులోని దెయ్యిం. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఈ ట్విస్ట్ బాగుంది.


Spread the love