థౌసండ్ వాలా లాగా పేలిన టాక్సీ వాలా

Spread the love

బ్యానర్‌: జిఏ 2 పిక్చర్స్‌, యువి క్రియేషన్స్‌
తారాగణం: విజయ్‌ దేవరకొండ, ప్రియాంక ఝావల్కర్‌, మాళవిక నాయర్‌, కళ్యాణి, యమున, మధునందన్‌, రవివర్మ, సిజ్జు, ఉత్తేజ్‌, చమ్మక్‌ చంద్ర, కిరీటి తదితరులు
కథనం, మాటలు: సాయికుమార్‌ రెడ్డి
సంగీతం: జేక్స్‌ బిజాయ్‌
కూర్పు: శ్రీజిత్‌ సారంగ్‌
ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌
నిర్మాత: ఎస్‌.కె.ఎన్‌.
కథ, దర్శకత్వం: రాహుల్‌ సంక్రిత్యాన్‌
విడుదల తేదీ: నవంబర్‌ 17.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం మన ముందుకి టాక్సీవాలా రూపంలో వచ్చిన సంగతి తెలిసిందే ఎన్నో అవాంతరాలు దాటుకొని విజయవంతంగా ఈ సినిమా ప్రదర్శించబడుతుంది. నోటా చిత్రంతో ఫ్లాప్ మూటగట్టుకున్న ఈ హీరో టాక్సీవాలా చిత్రంపై భారీ నమ్మకాలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే పైరసీ బారిన పడటంతో ఈ సినిమా విజయంపై పలు అనుమానాలు రేకెత్తాయి. కానీ ప్రేక్షకులు తమవెంట ఉన్నారని ధీమాగా చెబుతున్నారు చిత్ర యూనిట్..

వరుస విజయాలతో దూసుకెళుతున్న విజయ్ దేవరకొండ చేసిన ఒక డిఫరెంట్ సినిమాగా టాక్సీవాలా నిలిచిపోతుంది.

ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌ను దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ తనదైన మార్క్‌తో తెరకెక్కించిన విధానం నేటితరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

ఇక కథ విషయానికొస్తే,

హీరో ఉద్యోగం చేసి అన్నావదినలకి సాయపడాలని చూస్తోన్న యువకుడికి (విజయ్‌) అతని వదిన (కళ్యాణి) నగలు అమ్మి డబ్బులిస్తుంది. ఆ డబ్బుతో సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలని చూస్తోన్న అతనికి ఓ పాత కాంటెస్సా కారు తారసపడుతుంది. కార్‌తో పాటే గాళ్‌ఫ్రెండ్‌ (ప్రియాంక) కూడా రావడంతో హ్యాపీగా సాగిపోతున్న అతని ప్రయాణంలో ఒక కుదుపు. ఆ కారులో ఓ రహస్యముంది. అందులో ఏదో ఆత్మ వుందనే సంగతి ఆలస్యంగా తెలుస్తుంది. ఎలాగైనా ఆ ‘దెయ్యం కారు’ని వదిలించుకోవాలని చూస్తాడు. కానీ అది అతడిని వదులుతుందా? అసలు ఆ ఆత్మ ఆ కారులోకి ఎందుకొస్తుంది? ఏమి చేస్తే అది అందులోంచి వెళ్లిపోతుంది, ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరకాలంటే సినిమాని చూడాల్సిందే..?

హీరోయిన్ పబ్లిసిటీ లో కనిపించినత సినిమాలో కనిపించదు, ఆ విషయం కొందరికి నిరాశ / బాధ కలిగించొచ్చు సినిమా కథ లో ఇన్వొల్వె ఐన వారికీ ఇది ఒక గుర్తించ లేని చిన్న విషయం.

పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే…

ఫస్ట్ హాఫ్ వేగం తగ్గలేదు.
సెకండ్ హాఫ్ మేగం తగల్లేదు..

టాక్సీ వాలా – దీపావళి తరువాత పేలిన థౌసండ్ వాలా (సౌండ్ ఏ కొంచం తగ్గింది.)

రేటింగ్‌: 3/5


Spread the love