నా అభిమాని తరపున నేను క్షమాపణ చెప్తున్న: విజయ్ దేవరకొండ

Spread the love

ఒక్కోసారి తమ అభిమాన హీరోల కోసం చేసే పనులు అభిమానులను చిక్కుల్లో పడేస్తాయి. కొంతమంది అభిమానుల అభిమానం చుస్తే ఆశ్చర్యపోక తప్పదు. హీరోల వలన అభిమానులు ఎన్ని చిక్కుల్లో పడిన హీరోలు మాత్రం అసలు పట్టించుకోరు. కానీ విజయ్ దేవరకొండ దేంట్లో అయిన స్పెషల్ కదా అందుకే తన అభిమాని చిక్కుల్లో పడితే ఆ అభిమాని తరపున విజయ్ దేవరకొండ పోలీసులకు క్షమాపణ చెప్తున్నాడు. ఇవాళ ట్రాఫిక్ పోలీసుల తనిఖీలో భాగంతో ఒక బుల్లెట్ బైక్ కి నెంబర్ ప్లేట్ లేకుండా ఒక యువకుడు “రౌడీ” అని స్టిక్కరింగ్ వేయించుకున్నాడు. దీనితో అతనికి పోలిసులు ఫైన్ వేశారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం ఫై వెంటనే స్పందించాడు విజయ్ దేవరకొండ. నా అభిమాని తరపున నేను క్షమాపణ చెప్తున్నా. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను అని చెప్పాడు. ఇలా చెప్పడమే కాకుండా ఒక ఓపెన్ లెటర్ కూడా వ్రాసాడు. విజయ్ దేవరకొండ లో ఇలాంటి ప్రత్యేకమైన గుణాలు ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువ కాలం లో అంట ఎక్కువ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.


Spread the love