అందరిని నవ్వించడానికి ట్రైలర్ రూపంలో వెంకీ, వరుణ్ వచ్చేశారు

Spread the love

దిల్ రాజు దర్శకత్వం లో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్నా చిత్రం యఫ్ 2. తమన్నా, మెహరీన్ హీరోయిన్ లాగా నటిస్తున్నారు.వెంకటేష్ గారి చిత్రాలు అంటేనే కుటుంబ సమేతం గా వెళ్లి చూడవచ్చు. అలాంటి కుటుంబ సమేత సినిమాలో వెంకటేష్ నటించి చాలా రోజులు అయింది.ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది ఈ చిత్రం ఫుల్ కామెడీ నే పండిచేలా, కుటుంబ సమేతంగా వెళ్లి నవ్వుకునేలా ఉందని.

ఈ ట్రైలర్ చూస్తే వెంకటేష్ ఆంధ్ర వాడిగా, వరుణ్ తేజ్ తెలంగాణ వాడిగా కనపడబోతున్నారని తెలుస్తుంది. కోపం వచ్చినప్పుడు వెంకీ ఆసాన్ అంటూ వాళ్ళు చేసే కామెడీ అందరిని నవ్విస్తుంది. ట్రైలర్ ని బట్టి పెళ్లి అయిన తరువాత పెళ్లి కాక ముందు ఉండే అబ్బాయిల జీవితం మరియు భార్య భర్త ల మధ్య జరిగే గొడవల గురించి ఒక కామెడి మరియు ఎంటర్టైన్మెంట్ గా చూపించబోతున్నారు అని అర్ధం అవుతుంది. ఈ చిత్రం ఈ నెల 11 న విడుదల చేసి సంక్రాతి కి వెంకీ అభిమానులని గట్టిగ నవ్విస్తాడనే తెలుస్తుంది.


Spread the love