ఓటు వేసిన రామ్ కి షాక్ ఇచ్చిన అభిమాని

Spread the love

ఇప్పుడున్న యూత్ సోషల్ మీడియా లోనే ఎక్కువుగా గడుపుతున్నారు వాళ్లకి సంతోషం వచ్చిన బాధ వచ్చిన అన్ని సోషల్ మీడియా లోనే పంచుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న నేటి తరుణంలో సెలెబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను బాగా ఉపయోగిస్తున్నారు. కాగా నిన్న (డిసెంబర్ 7) తెలంగాణ ఎన్నికలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. తమ ఓటు హక్కును వినియోగించున్న పలువురు సెలెబ్రిటీలు, తాము ఓటు హక్కును వినియోగించుకున్నామని తెలిసేలా వేలుపై ఉన్న ఇంకును చూపెడుతూ దిగిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

Tollywood Hero Ram Shocking Tweet About Telangana Elections

ఇదే తరుణం లో టాలీవుడ్ హీరో రామ్.. తాను ఓటు వేసిన ఇంకు చూపిస్తూ దిగిన సెల్ఫీని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘‘నాది నాదే.. మరి మీది?’’ అనే ప్రశ్న వేశారు. ఇది చూసిన
రామ్ అభిమానులు మరియు నెటిజన్స్ తమ ఓటు హక్కుని కూడా వినియోగించుకున్నామని వేలుపై ఉన్న సిరాను చూపెడుతూ రామ్ కి రీట్వీట్ ద్వారా తెలిపారు. కానీ
రామ్ ట్వీట్ కి ఓ నెటిజన్ మాత్రం ‘మాది ఆంధ్రా లే’ అని కామెంట్ పెట్టాడు.

ఇది చూసిన రామ్ వెంటనే నెటిజన్ పెట్టిన కామెంట్‌పై రియాక్ట్ అవుతూ.. ‘‘అదీ కూడా మనదే తమ్ముడూ.. మనకు ఒక్క ముఖ్యమంత్రి సరిపోలేదని ఇద్దరికి ఇచ్చాం అంతే. విడదీసి ఇచ్చాం.. విడిపోలేదు. రెండూ మనవే’’ అంటూ ఆసక్తికరంగా అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. రామ్ నుంచి ఈ రియాక్షన్ చూసే సరికి నెటిజన్స్ ఒక్క సారిగా షాక్ అయ్యారు.. తెలుగు రాష్ట్రాలపై రామ్ కి ఉన్న ప్రేమ చూసి పలువురు మెచ్చుకున్నారు.. ఇక నిన్న పోలింగ్ ముగియడంతో ప్రధాన పార్టీ లు అయిన తెరాస మరియు మహాకూటమి పార్టీ లు ఎన్నికల ఫలితాలకోసం ఎదురుస్తున్నారు..


Spread the love