‘సైలెన్స్’ తర్వాత పెళ్ళికి సిద్ధపడిన అనుష్క

Spread the love

అరుంధతి సినిమా తరువాత అనుష్క కి క్రేజ్ పెరిగిపోయింది. అప్పటి నుండి పౌరాణిక పాత్రలు అంటే డైరెక్టర్స్ అనుష్క నే ఎంచుకుంటున్నారు .మిర్చి, బాహుబలి తరువాత అనుష్క,ప్రభాస్ కాంబినేషన్ కి వచ్చిన రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అంటే స్వయంగా ఫాన్స్ ఏ వాళ్ళ ఇద్దరి జంట చూడచక్కగ ఉందని వాళ్ళ ఇద్దరినీ పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు.

దీనికి తోడు ఏ ఫంక్షన్ కి వెళ్లిన వీళ్ళ ఇద్దరు చనువుగా ఉండడం చూసి రూమార్స్ పెరుగుతున్నాయి.కానీ అనుష్క,ప్రభాస్ మాత్రం వాళ్ళ ఇద్దరి మధ్య స్నేహ బంధం తప్ప ఇంకెటువంటి రిలేషన్ లేదని చెప్పుకొస్తున్నారు.అనుష్క మాత్రం తానూ ఇప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పేసింది. చాల రోజుల తరువాత అనుష్క ఒక సినిమా కి ఒప్పుకుంది.

అది కోన వెంక‌ట్ నిర్మాణంలో ‘సైలెన్స్’ సినిమా చేయ‌బోతుంది. ఆ సినిమాలో అనుష్క ఒక చెవిటి అమ్మాయిల నటించబోతుందని చెప్పారు. ఆ సినిమా పూర్తి అయ్యేసరికి ఒక సంవత్సరం పడుతుంది ఆ తరువాత పెళ్లి అని మనం అనుకోవచ్చు. మొత్తానికి అనుష్క పెళ్లి విషయం ఫై ఒక క్లారిటీ వచ్చేసింది..


Spread the love