యన్.టి.ఆర్ లో యన్.టి.ఆర్ లేకపోవడానికి అసలు కారణం చెప్పిన కళ్యాణ్ రామ్

Spread the love

నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ కి సపోర్ట్ గా ఉంటూ ఉంటాడు.వాళ్ళ బంధం మరొకరికి స్ఫూర్తి గా ఉంటుంది. ఎన్టీఆర్ అంత కాకపోయినా కళ్యాణ్ రామ్ కూడా ఒక మంచి నటుడు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.తనవంతు కృషి తను చేస్తున్నాడు.ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నసినిమా. అభిమానులు అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా.

ఈ సినిమాలో అన్ని పాత్రలకి అందరిని సెట్ చేసిన క్రిష్ చాల అద్భుతం గా ఈ సినిమా ని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాని ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయకపోవడం అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీనిపై స్పందించిన కళ్యాణ్ రామ్ అత్యంత ముఖ్యమైన పాటల ఆవిష్కరణ తమ్ముడు చేతి మీద జరిగింది. అది బాబాయ్ తమ్ముడికి ఇచ్చే ప్రాధాన్యత.

ఇదిగో పాత్ర అని ఒక పాత్ర తారక్ కి ఇవ్వచ్చు కాని ఒక చిన్న పాత్రని సూపర్ స్టార్ అయిన మా తమ్ముడు చేస్తే అభిమానులు నిరుత్సాహ పడతారని ఉద్దేశ్యంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పారు.ప్రేమ అనేది మనసులో ఉంటుంది. అది ప్రదర్శించుకునే వస్తువు కాదు. అని తారక్ ని సపోర్ట్ చేస్తూ సమాధానం చెప్పాడు.


Spread the love