బాలయ్యకి ఇంకోసారి పడింది బ్లడ్డు, బ్లీడు, బఫెల్లో అంటూ నాగబాబు ఫైర్

Spread the love

సోషల్ మీడియా లో అభిమానులతో ముచ్చటించిన నాగబాబు బాలకృష్ణ గురించి ఒక అభిమాని ఆయనను అడగగా బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదని సమాధానమిచ్చారు . తరువాత ఆ విషయం తీవ్ర వివాదం అవడంతో నాగబాబు సోషల్ మీడియా లో మరో వీడియో ను విడుదల చేసారు ఈ వీడియో లో బాలకృష్ణ తెలియదని చెప్పడంతో కొంత మంది బాధపడ్డారని తన సన్నిహితులు చెప్పారని తప్పైపోయిందన్నారు.

అయితే ఈ వీడియో లో నందమూరి బాలకృష్ణ గురించి కాకుండా వల్లూరి బాలకృష్ణ అనే కమెడియన్ గురించి ప్రస్తావిస్తూ బాలకృష్ణ గొప్ప హాస్య నటుడని బాలకృష్ణ అంటే తనకు అభిమానమని తెలిపారు నాగబాబు .తాజాగా సోషల్ మీడియా లో అయిన చేసిన పోస్ట్ హల్ చల్ చేస్తుంది . నందమూరి బాలకృష్ణ సినిమాలోని డైలాగ్ ను గుర్తు చేసేలా బ్లడ్డూ.. బ్రీడూ.. బఫెల్లో..అంటూ గేదె ఫోటోలు పెట్టి స్థిరమైన జాతి మరియు రక్తవర్ణం కలిగి ఉన్న ఈ బ్రీడ్ గేదెలు అమ్మకానికి ఉన్నాయ్ అని కొనుగోలు చేయాలంటే వెబ్ సైట్లు లో కొనుగోలు చేయవొచ్చని కేవలం ప్రజా ప్రయోజనం కోసమేనని పోస్ట్ లో తెలిపారు.

ఒక సందర్భంలో ‘మా బ్రీడ్‌ వేరు, మా బ్లడ్‌ వేరు..’ అని చెబుతాడు బాలయ్య బాబు. దానికి కౌంటర్‌గా నాగబాబు పై విధంగా చేసారని అంటున్నారు. మరి ఈ విషయం కూడా వివాదం అవుతుందేమో వేచి చూడాలి. గతం లో పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదని మీడియా అడిగిన ప్ప్రశ్నకు నందమూరి బాలకృష్ణ సమాధానమిచ్చారు , అందుకే నాగబాబు ఇలా పంచ్ లు ఇస్తున్నారంటూ విశ్లేషకులు చెప్తున్నారు .


Spread the love