తెలుగు బిగ్ బాస్-3 లో పాల్గొనే వివాదాస్పద ప్రముఖుల లిస్ట్

Spread the love

బిగ్ బాస్ తెలుగు నాట ప్రవేశించినప్పటినుంచి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది దీనికి కారణం తారక్. బిగ్ బాస్ మొదటి సీజన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు తారక్ . సీజన్ 1 లో తారక్ నే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బిగ్ బాస్ సీజన్ 1 లో నటుడు శివ బాలాజీ విజేతగా నిలిచారు. బిగ్ బాస్ సీజన్ 2 లో వ్యాఖ్యాతగా తారక్ బిజీ షెడ్యూల్ కారణం గా తప్పుకున్నారు, అయితే బిగ్ బాస్ యాజమాన్యం హీరో నాని ని హోస్ట్ గా తీసుకుంది. బిగ్ బాస్ 2 సీజన్ తో నాని కూడా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు . అయితే సీజన్ 2 లో కౌశల్ ప్రధానం గా షో ఏకపక్షం గా సాగింది కొన్ని సార్లు నాని అసహనం వ్యక్తం చేసాడు . సీజన్ ఎప్పుడు అయిపోతుందో అని ఎదురు చూస్తున్న అంటూ వ్యాఖ్యలు చేసాడు. అయితే సీజన్ 1 లో కానీ 2 లో కానీ ఒకరు లేదా ఇద్దరు కంటే ప్రపంచానికి పెద్దగా తెలిసిన ప్రముఖులు ఎవరూ లేరు.

కాగా బిగ్ బాస్ యాజమాన్యం సీజన్ 3 పై ప్రేత్యేక ద్రుష్టి పెట్టనింది . సీజన్ 3 కు హోస్ట్ గా విక్టరీ వెంకటేష్ పేరు ప్రచారం లో ఉంది, అలాగే బిగ్ బాస్ 3 లో పార్టిసిపెంట్స్ గురించి కూడా ప్రచారం జరుగుతుంది. సీజన్ 3 లో పాల్గొనే వారు ‘‘రేణు దేశాయ్, వరుణ్ సందేశ్,హేమచంద్ర, ఉదయభాను,టీవీ ఆర్టిస్ట్ జాకీ, గద్దె సిందూర, యూట్యూబ్ స్టార్ ‘మహాతల్లి’ ఫేమ్ జాహ్నవి’’ శోభిత ధూళిపాల, జబర్దస్త్ నరేష్, రఘు మాస్టర్,చైతన్య కృష్ణ, మనోజ్ నందన్, కమల్ కామరాజు, నాగ పద్మిని తదితరులు పాల్గొంటారని సోషల్ మీడియా లో వీళ్ళ పేర్లు చెక్కర్లు కొడ్తున్నాయి . అయితే బిగ్ బాస్ ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా వేరే వారిని తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. త్వరలోనే ఈ సస్పెన్స్ కు బిగ్ బాస్ సీజన్3 లో పాల్గొనే వారి పేర్లను ద్రువీకరించనుంది .


Spread the love