దర్శకేంద్రుడికి చుక్కలు చూపించిన తెలంగాణ ఓటర్లు

Spread the love

తెలంగాణ లో పోలింగ్ రసవత్తరంగా సాగుతుంది అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తులో పోలింగ్ సజావుగానే సాగుతుంది.. అయితే కొన్ని చోట్ల సెలబ్రిటీస్ కి మాత్రం తిప్పలు తప్పటం లేదు.. టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కి కూడా ఆ అవమానం తప్పలేదు అసలు విషయానికొస్తే,గతం లో మెగాస్టార్ చిరంజీవికే అనుకుంటే ఇప్పుడు దర్శకేంద్రుడికి చుక్కలు చూపించారు ఓటర్లు.

దర్శకేంద్రుడిని బంజారాహిల్స్ ఓటర్లు అవమానించించిన సంఘటన వెలుగులోకి వచ్చింది..దాంతో ఓటు వేయకుండానే వెనుదిరిగిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.అసలేం జరిగిందంటే ఓటర్లు భారీ క్యూ లో నిలబడి ఓట్లు వేసేందుకు ఇబ్బంది పడుతున్న సమయం లో ప్రముఖ వ్యక్తులు డైరెక్ట్ గ పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటు వేసి వస్తుంటారు. కొందరు ఓటర్లు ఇలాంటి సంఘటనలు పెద్దగా పట్టించుకోరు. సహనం కోల్పయిన ఓటర్లు మాత్రం ప్రముఖులను అడ్డుకోవడం కొత్తేమి కాదు .

గతం లో కూడా ప్రముఖ అగ్ర కధానాయకుడు మెగాస్టార్ చిరంజీవి కూడా డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి వెళ్ళబోతే చిరంజీవి ని సైతం అడ్డుకుంటే చేసేదేంలేక క్యూ లో నిలబడి ఓటు వేసి ఓటు హక్కు వినియోగించుకొని వెనుదిరిగారు.
మరి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన ఓటు ను వినియోగించుకుంటారని ఓటర్ల రద్దీ తగ్గాక మరలా బంజారాహిల్స్ లోని ఫిలింనగర్ లో ఓటును వినియోగించుకుంటారని తన శ్రేయోభిలాషులు ప్రకటన ఇచ్చారు.


Spread the love