సూపర్ స్టార్ రజినీకాంత్ పేట మూవీ రివ్యూ

Spread the love

రజనీకాంత్ అంటే తమిళ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో మన తెలుగు ప్రేక్షకులు కూడా అలానే ఆదరిస్తారు. కానీ ఈ సారి స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం తో రజని సినిమా కి సినిమా హాల్ లు తక్కువ అయ్యాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల అందరి చూపు ఎన్టీఆర్ బయోపిక్ మీద ఉంది. నిన్న విడుదల అయిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల మన్నలని పొందుతుంది.

కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం లో సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన చిత్రం పేట. చాలా కాలం తరువాత సిమ్రాన్ ని తెర మీద చూయించాడు దర్శకుడు కార్తిక్. అలానే త్రిషని రజనీకాంత్ సరసన చూపించాడు. ఒక స్టార్ నటుడు అయిన విజయ సేతుపతి ని విలన్ గా చూపించాడు. మొత్తానికి మంచి నటి నటుల్ని ఈ సినిమా కి ఎంచున్నారని చెప్పచ్చు.

ఈరోజు విడుదల అయిన పేట చిత్రం అభిమానులని మెప్పించింది అనే చెప్పాలి. కధ విషయానికి వస్తే కాలి (రజినీకాంత్) ఒక హాస్టల్ వార్డెన్, అక్కడ ఉన్న విద్యార్థులని క్రమశిక్షణ లో పెట్టాలని ప్రయత్నిస్తాడు. కానీ అక్కడ ఒక గ్యాంగ్ మాత్రం కాళి కి విరోదంగా ఉంటారు. సిమ్రాన్ ఈ చిత్రం లో ఒక స్టూడెంట్ తల్లిగా కాళి కి పరిచయం అవుతుంది.

విరోధం పెంచుకున్న విద్యార్థులు కాళి ఫై దాడి చేస్తారు. దాడి చేసిన సమయం లో అసలు కాళి ఎవరు తన గతం ఏమిటి అనేది ఈ కధ. ఫాన్స్ అందరు ఈ సినిమా ని భాష తో పోలుస్తున్నారు. త్రిష మరియు విజయసేతుపతి, సిమ్రాన్ తమ పాత్రల్లో ఇమిడిపోయారనే చెప్తున్నారు. మొత్తానికి రజని ఫాన్స్ కు ఒక మంచి సినిమా ని ఇచ్చారని కార్తీక్ నీ అందరు పొగుడుతున్నారు..

రేటింగ్:3/5


Spread the love