తమిళ అగ్ర నటుడి సినిమా చూసేందుకు డబ్బులు ఇవ్వలేదని తండ్రి పై దాడి చేసిన తనయుడు

Spread the love

తమిళనాడు లో అగ్ర కథానాయకులను దేవుళ్ళు లా పూజిస్తారు అందులో కొత్తమీ లేదు , అయితే అజిత్ చాలా మంచి వ్యక్తిత్వం గల నటుడు అందరిలా కాకుండా సహజంగా జీవిస్తుంటాడు ఈ ధోరణి వల్లే కొద్దీ కాలం లోనే తమిళనాట అగ్ర కథానాయకుడిగా ఎదిగాడు, అజిత్ ను ముద్దుగా ‘తాల’ అంటే దేవుడి లా పూజిస్తారు ఆయన అభిమానులు. నిన్న విడుదల అయిన సినిమా విశ్వాసం మంచి టాక్ ను తెచ్చుకుంది, సినిమా విడుదల అంటే అభిమానులకు పండుగే, అయితే ఫ్లెక్స్, కటౌట్ బ్యానెర్ల కు పూలదండలు వేయడం పాలాభిషేకం చేయడం సహజమే, కొన్ని సందర్భాల్లో ఒకరి అభిమానులు మరొకరి అభిమానులతో గొడవలు పడటం కూడా మనం వింటూనే ఉంటాం.

వీటికి భిన్నంగా తమిళనాడు లో తాజాగా కొన్ని ఆశ్చర్య సంఘటనలు చోటు చేసుకున్నాయి.ఈ మధ్య అభిమానుల అభిమానం హద్దులు దాటిపోతుంది, నిన్న విడుదల అయిన రజినీకాంత్ పేట సినిమా అజిత్ సినిమా విశ్వాసం రెండు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి, అయితే ఫ్లెక్సీ లు చింపారు అంటూ ఇరు వర్గాల అభిమానులు కత్తులతో దాడులు చేసుకున్నారు.ఆరు మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు .

నిన్న రజినీకాంత్ అభిమాని రజినీకాంత్ మీద అభిమానంతో తన వివాహాన్ని భిన్నంగా పేట సినిమా థియేటర్ లో చేసుకున్నాడు . తాజాగా అజిత్ అభిమాని ఎవరు ఊహించని, ఊహకు అందని పని చేసాడు. అజిత్ సినిమా విశ్వాసం చూసేందుకు డబ్బులు ఇవ్వలేదని తన తండ్రి ని పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

తండ్రి పెట్టిన కేకలకు చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని మంటలను ఆర్పి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఆ తండ్రి పరిస్థితి విషమంగా ఉందని వైదులు తెలిపారు, ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు పెట్రోల్ పోసి నిందితుడు పరారయ్యాడని విచారణ చేపడుతున్నామని పోలీసులు మీడియాకు తెలిపారు .


Spread the love