హైదరాబాద్ అల్లుడు కాబోతున్న తమిళ హీరో

Spread the love

హైదరాబాద్ లో ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను వివాహమాడనున్న నటుడు విశాల్ . దక్షిణ సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో విశాల్ ఒకడు. 40 ఏళ్లు పైబడిన ఇంకా ఒంటరిగానే ఉన్న విశాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, ప్రభాస్‌లా విశాల్ పెళ్లి కూడా ఎప్పుడూ చర్చనీయాంశమే. అసలుకే తమిళనాట విశాల్ ఏనలేని క్రేజ్ ను సాదించుకున్నాడు.

‘తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కి ప్రెసిడెంట్, నడిగర్ సంఘం సెక్రటరీ నే కాకా తాను చేసే సినిమాలకు దక్షిణ సినీ ప్రపంచం లో మంచి అభిమానం సాదించుకున్నాడు . పైగా ప్రజాసమస్యల పై పోరాడే నటులలో అగ్ర స్థానం లో ఉంటాడు విశాల్ , నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న విశాల్ గతంలో సంఘానికి భవనం పూర్తిచేశాకే పెళ్లి చేసుకుంటానని శపథం చేశారు.

ఇప్పుడు భవన నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమవుతోంది. కాగా విశాల్ తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని ఆయన తండ్రి జీఎస్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. అయితే విశాల్ అది పెద్దలు కుదిర్చిన వివాహం కాదని,  ప్రేమ వివాహమని విశాల్ తెలిపాడు. ఈ నేపథ్యంలో ఆయన పెళ్లికి సంబంధించిన ఈ వార్త ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతోంది.

విశాల్ చేసుకోబోయే అమ్మాయి పేరు అనీషా. హైదరాబాద్‌కి చెందిన విజయ్ రెడ్డి, పద్మజ దంపతుల ముద్దుల కుమార్తె. విజయ్ రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని, త్వరలోనే హైదరాబాద్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలుస్తోంది. విశాల్ త్వరలో ఓ ఇంటి వాడవుతున్నాడని సంబరపడిపోతున్నారు విశాల్ సన్నిహితులు , అభిమానులు .


Spread the love