టెన్నిస్ స్టార్ సానియాతో సూపర్ స్టార్ రచ్చ రచ్చ

Spread the love

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు మహేష్ బాబు, టాలీవుడ్ స్టార్స్ లో మహేష్ బాబు ప్రత్యేకం విమర్శలకు దూరంగా ఉంటారు , సినిమాలకు షూటింగ్స్ కు కాస్త విరామం దొరికితే హాలిడే ట్రిప్స్ తో ఫామిలీ తో సంతోషం గా గడుపుతుంటారు మహేష్ బాబు.

తాజాగా కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకోవడం కోసం పిల్లలు గౌతమ్ , సితార భార్య నమ్రత తో కలిసి దుబాయ్ కి వెళ్లారు, అక్కడే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు వారి కుటుంబంతో కలిసి మహేష్ బాబు.అదే సమయంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా దుబాయ్ వెళ్ళింది.

అనుకోకుండా చివరి రోజు సానియా తోడవ్వటంతో అంతా కలిసి బాగా ఎంజాయ్ చేశారు, మహేష్ ఫ్యామిలీతో కలిసి సరదాగా దుబాయ్ లో సందడి చేసింది సానియా. అదే సమయం లో వీరందరూ కలిసి ఒక ఫోటో దిగారట, సానియా తో కలిసి ఉన్న మహేష్ నమ్రత ఫోటో ను నమ్రత సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ ఫోటో హల చల్ చేస్తుంది. హాలిడే ట్రిప్ ను దుబాయ్ లో చాలా సంతోషంగా జరుపుకున్నామని ట్రిప్ ముగించుకొని భారత్ కు తిరిగి వస్తున్నామని తెలిపింది నమ్రత .


Spread the love