సూప‌ర్ నేచుర‌ల్ శక్తులతో సందీప్ కిషన్ ఫ‌స్ట్‌లుక్‌

Spread the love

సందీప్ కిషన్ వరుస సినిమాలతో చాల బిజీ గా ఉన్నాడు.. ప్రస్తుతానికి తమన్నా సందీప్ కిషన్ జంటగా నెక్స్ట్ ఏంటి సినిమా విడుదలకి సిద్ధమైంది.. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సందీప్ కిషన్ మరో వైవిద్యమైన సినిమా చేస్తున్నాడు..ఈ యువ క‌థానాయ‌కుడు ఇప్పుడు నిర్మాత‌గా మారారు. సందీప్ కిష‌న్‌, అన్య సింగ్ హీరో హీరోయిన్‌గా కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాత‌లుగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే`. కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా….

ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ సూప‌ర్ నేచుర‌ల్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో సినిమాను రూపొందిస్తున్నాం. వైవిధ్య‌మైన సినిమాలు చేసిన హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న తొలి సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల‌ర్ ఇది. సందీప్ కిష‌న్‌ను మ‌రో కొత్త పాత్ర‌లో చూస్తారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే చిత్రమ‌వుతుంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌, పాట‌లు విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం“ అన్నారు.

మా సినిమా ర‌షెష్ చూసి `గూఢ‌చారి` వంటి హిట్ చిత్రాన్ని విడుద‌ల చేసిన విస్తా మ‌ర్చంట్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామ్యం వ‌హించారు. అలాగే ప్రముఖ నిర్మాత అనీల్ సుంక‌ర‌గారు ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమాను విడుద‌ల చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా విస్తా మ‌ర్చంట్స్‌, అనీల్ సుంక‌ర‌గారికి థాంక్స్‌“ అన్నారు.

 


Spread the love