విడుదలకి సిద్దమైన సుబ్రహ్మణ్య‌పురం సినిమాకి షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

Spread the love

సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్లపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన చిత్రం సుబ్రహ్మణ్య‌పురం. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకొని యు/ఎస‌ర్టిఫికెట్ తో డిసెంబర్ 7న అత్య‌ధిక థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కుల ముందుకురానుంది.. సైన్స్ కి అంద‌ని ఎన్నో ర‌హాస్యాలు మాన‌వమేథ‌స్సుకు స‌వాళ్ళు విసురుతూనే ఉంటాయి.వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌లో త‌న‌దైన ముద్ర‌ను వేసుకున్నసెన్సిబుల్ హీరో సుమంత్ నటించిన ఈ సినిమా థీమ్ కూడా అలాంటిదే..

భ‌గ‌వంతుని మీద న‌మ్మ‌కం కూడా అలాంటిదే, ఆ న‌మ్మ‌కాన్ని ప్ర‌శ్నించే కార్తిక్ ప‌రిశోధ‌న‌లు ఎలాంటి నిజాల‌ను వెలుగులోకి తెచ్చాయి.. కాపాడ‌వ‌ల్సిన భ‌గ‌వంతుడి ఆగ్ర‌హం త‌ట్టుకోవ‌డం సాధ్యం అవుతుందా అనే ప్ర‌శ్న‌లు కు స‌మాధానం ఈ నెల 7న దొర‌క‌బోతుంది. విడుద‌లైన ట్రైల‌ర్ కి మంచి స్పంద‌న ల‌భించింది.

ఒక‌ రోజులో 1మిలియ‌న్ వ్యూస్ ని సాధించిన సుబ్ర‌మ‌ణ్య‌పురం ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను పెంచింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ చిత్ర యూనిట్ కి అభినంద‌న‌లు తెలిపింది. థ్రిల్ల‌ర్స్ లోసుబ్రహ్మణ్య‌పురం ప్ర‌త్యేక స్థానం సంపాదించుకుంటుద‌ని అంటుంది చిత్ర యూనిట్. విజువల్ఎ ఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ‘సుబ్రహ్మణ్య‌పురం’ ఇండస్ట్రీ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ లు పూర్తి అయ్యాయి.

బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం ‘సుబ్రమణ్యపురం ’ కు వర్క్ చేసారు. బాల సుబ్రమణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని డిసెంబ‌ర్ 7న బ్ర‌హ్మండ‌మైన విడుద‌ల‌కు సిద్దం అవుత‌న్నసుబ్రహ్మణ్య‌పురం ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతుల‌ను అందిస్తుంద‌ని న‌మ్మ‌కం వ్య‌క్త ప‌రిచింది చిత్ర యూనిట్.

 


Spread the love