సంక్రాంతికి సొంతూరులో రచ్చ చేయబోతున్న బన్నీ

Spread the love

ఆంధ్రాలో సంక్రాంతి పండుగ అంటేనే చాలా ప్రత్యేకం, ఈ పండుగలో కోడి పందేలు కుల మతాలకు అతీతంగా అందరు ఎంతో ఆతృత గా పాల్గొంటారు, మొన్న షూటింగ్ కోసం ఆంధ్ర వెళ్లిన విజయ్ దేవరకొండ కూడా కోడిపందేలు చూడాలని ఉందని ఆంధ్ర లో బాగా జరుపుకుంటారని ఆంధ్ర సంక్రాంతి పండుగ పై ఆసక్తి కనపరిచాడు.

మొన్నటి వరకు బిజి లైఫ్ తో ఉన్న బన్నీ సంక్రాంతి కి పాలకోల్లు వెళ్లాలని నిశ్చయించుకున్నారు, బన్నీ సొంతూరు అయిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు వెళ్లి చాలా కాలం అయిందని ఎప్పుడు సినీ లైఫ్ తో బిజీ గా ఉండటం వలన ఈ మధ్య కాలం లో వెళ్లడం కుదరలేదని, ప్రస్తుతం షూటింగ్ లు ఏమి లేకపోవడంతో కాస్త విరామం దొరకడం వలన కుటుంబంతో పాలకొల్లుకు పయనమవుతున్నాడట బన్నీ.

ఈసారి గోదావరి జిల్లా అందాలను కచ్చితం గా తాను ఆస్వాదించడమే కాకా పిల్లలకు కూడా చూపించబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ తన తదుపరి సినిమాను కొత్త సంవత్సరం సందర్భంగా ప్రకటించాడు. అయితే సంక్రాంతి కి తన సొంతూరు కి కమిట్ అవడంతో ఆ తర్వాతే తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాడట బన్నీ.


Spread the love