ట్రెండింగ్ లో ఉన్న చిత్రలహరి ” పరుగు పరుగు” సాంగ్

Spread the love

కిషోర్ తిరుమల దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం చిత్ర లహరి. ఈ చిత్రం లో హీరోయిన్లుగా కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ వ్యవహరిస్తున్నారు. సునీల్ , వెన్నెల కిషోర్ ఈ చిత్రం లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం యొక్క టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఎంతోకాలం నుండి సాయి ధరమ్ తేజ్ కు సరైన హిట్ లేదు. ఈ చిత్రం తో అయిన హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఒక పాటను విడుదల చేసారు. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రేండింగ్ లో ఉంది. ‘పరుగు పరుగు వెళుతున్న… అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు. ‘చక్రాల్లేని సైకిల్‌లాగా.. రెక్కల్లేని ప్లైట్‌లాగా.. బుల్లెట్ లేని రైఫిల్‌లాగా.. దారంలేని కైట్‌లాగా.. ఈ పాట ఈ విధంగా ఉంది. విశేషం ఏమిటంటే ఈ పాటకి దేవి శ్రీ లిరిక్స్ ఇచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా డేవిడ్ సిమన్ ఈ పాటను ఆలపించారు .


Spread the love