జక్కన్న కుమారుడి కొత్త బోణి ఆకాశవాణి..

Spread the love

దర్శక ధీరుడు రాజమౌళి RRR సినిమా మొదలు పెట్టేశాడు .. ఈ డైరెక్టర్ తనయుడు కార్తికేయ తండ్రి కి సంభందించిన అన్ని విషయాలలో చురుగ్గా పాల్గొంటూ సహాయం చేస్తున్నాడు..బాహుబలి వంటి సినిమాలో తండ్రికి వెన్నంటి ఉండి అన్ని తానై చూసుకున్నాడు అయితే ఇప్పుడు ఈ దర్శక ధీరుడు కుమారుడు నిర్మాతగా మారాడు.రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో చేసిన అశ్విన్‌ గంగరాజును దర్శకునిగా పరిచయం చేస్తూ కార్తికేయ ఈ సినిమా నిర్మించనున్నారు.

ఇందులో మరో విశేషం ఏంటంటే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు మరియు సింగర్ కాలభైరవ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు..ఇలా రాజమౌళి కుమారుడు నిర్మాతగా కీరవాణి కుమారుడు సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు..ఈ సినిమాకి సంభందించిన ఒక పోస్టర్ ని రాజమౌళి ట్వీట్ చేసాడు

ఈ లుక్‌ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్న జక్కన్న.. ‘‘ఈ సందర్భంలో నాకంటే ఎక్కువ సంతోషించే వ్యక్తి ఉండరేమో! నా శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రాబోతున్న ‘ఆకాశవాణి’ చిత్రం ద్వారా కార్తికేయ నిర్మాతగా, కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం కావటం చాలా చాలా సంతోషంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని తెలిపారు. రాజమౌళి చేసిన ఈ ట్వీట్‌పై ప్రేక్షకులు లైకుల వర్షం కురిపిస్తూ.. అందరికీ బెస్ట్ విషెస్ చెబుతున్నారు.


Spread the love