శంకర్ చరిత్రలోనే అతి చిన్న సినిమాగా రికార్డులకెక్కిన రోబో 2.0

Spread the love

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రతి నాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రోబో 2.0 ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేశారు..

ఈ సినిమా నిడివి కేవలం 2.28 గంటలు (148 నిమిషాలు) మాత్రమే ఉందట. విక్రమ్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన ‘ఐ’ 188 నిమిషాల నిడివితో శంకర్‌ కెరీర్‌లోనే లెంగ్త్‌ ఎక్కువ ఉన్న సినిమాగా, 167 నిమిషాల నిడివితో ‘రోబో’ అతి చిన్న సినిమాగా నిలిచాయి. ఇప్పుడు ‘రోబో’ స్థానంలో ‘2.0’ చేరింది.

కేవలం 148 నిమిషాలతో శంకర్‌ కెరీర్‌లో అతి తక్కువ నిడివి గల సినిమాగా నిలిచింది. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అమీ జాక్సన్‌ కథానాయిక. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ స్ర్కీన్లపై ‘2.0’ను విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

దుబాయ్ లో రజిని కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే వుంది అందుకే చిత్ర నిర్మాతలు ఈ సినిమాని అక్కడ మల్టీఫ్లెక్ లలో రోజుకి 100 షో లో నిర్వహించాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు.. అలాగే తమిళనాడులో కూడా ఉదయం 4 గ: నుండే షో లు వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేశారట, శంకర్ దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు విజయ ఢంకా మోగించాయి మరి ఈ రోబో 2.0 ఎన్ని రికార్డ్స్ ని కొల్లగొడుతుందో చూడాలి..!


Spread the love