రామ్ చరణ్ పక్కన దారుణ స్థితిలో ప్రపంచసుందరి హీరో

Spread the love

రాజమౌళి నిర్మిస్తున్న RRR  మరియు యాక్షన్ డైరెక్టర్ బోయపాటి సినిమాతో ఫుల్ బిజీ గ వున్నాడు రామ్ చరణ్..
రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా వినయ విధేయ రామ. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నప్పటికీ సినిమాలో కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇటీవల సినిమా యూనిట్ పవర్ ఫుల్ టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ మెగా అభిమానులని అలరిస్తుంది.

ఈ టీజర్ లో మీరు బాగా గమనిస్తే చరణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా మెరిశాడు..ఎట్టకేలకు అతడిని గుర్తించిన అభిమానులు సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ నటించిన జీన్స్ సినిమా పేరు చెబితే చాలు ఆ హీరో ఎవరో గుర్తుకు వస్తాడు. ఆ హీరో ఎవరో కాదు ప్రశాంత్. చాలా కాలం పాటు ప్రశాంత్ తమిళ అభిమానులని రొమాంటిక్ సినిమాలతో అలరించాడు.

జీన్స్ సినిమా తర్వాత ప్రశాంత్ స్థాయిని పెంచేలా విజయాలు దక్కలేదు. కానీ ప్రశాంత్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. విజయ విధేయ రామ సినిమాలో ప్రశాంత్ రామ్ చరణ్ సోదరుడిగా నటిస్తున్నాడు.

టీజర్ లో ప్రశాంత్ కనిపించే సన్నివేశాలు ఉన్నాయి. జీన్స్ చిత్రంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రశాంత్ ని గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోగా నటించిన ప్రశాంత్ ఇపుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడని ఆయన ఫ్యాన్స్ భాదపడుతున్నారు. ప్రశాంత్ కి సరైన అవకాశాలు మరియు విజయాలు దక్కలేదు కనుకే ఇలా మారిపోయాడని అందరు భావిస్తున్నారు…


Spread the love