దర్శక ధీరుడు రాజమౌళి రామ రావణ రాజ్యం మొదలైంది

Spread the love

బాహుబలి తర్వాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన తదుపరి చిత్రం అధికారికంగా ప్రారంభించారు. రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ లు ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం అందరికి తెలిసినదే కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 19- నవంబర్-2018 నుండి మొదలైంది.

ఇదిఇలా ఉండగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి “రామ రావణ రాజ్యం” అనే పేరు ఖరారు చేసినట్లు ఒక వార్త నెట్ లో హల్ చల్ చేస్తుంది..

తదుపరి వివరాల లోకి వెళితే మొదటగా ఈ చిత్రానికి కథానాయకులు గా అల్లు అర్జున్ మరియు అజిత్(తమిళ్ ) లను దృష్ఠి లో ఉంచుకుని ఈ కథను వ్రాసినట్లు ఈ చిత్రానికి కదా రచయిత కే. వి.విజయేంద్ర ప్రసాద్ బాహుబలి-2 సినిమా ప్రచారం లో భాగం గా ఒక ఇంటర్వ్యూ లో తెలియజేసారు. దాని ద్వారా తెలుగు తమిళ్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుందని భావించారు.

తరువాత కొన్ని ప్రతికూల పరిస్థితుల వల్ల వారితో కాకుండా అల్లు అర్జున్ బదులు రామ్ చరణ్, అజిత్ బదులు ఎన్.టి.ఆర్ లతో ఈ చిత్రాన్ని తెరపైకెక్కిస్తున్నారు.
ఒకవేల అల్లు అర్జున్ మరియు అజిత్ లతో ఈ చిత్రాన్ని రూపొందించి ఉంటే ఎలా ఉండేదో భావించి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.


Spread the love