మొదటి రోజే తారక్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన జక్కన్న

Spread the love

రాజమౌళి ఈ పేరు వినగానే హిట్ సినిమాలే గుర్తుకొస్తాయి.అంత ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ టాప్ డైరెక్టర్ బాహుబలితో తన సత్తా ని ప్రపంచానికి చూపించి తానేంటో నిరూపించుకున్నాడు.అలాంటి ఈ టాప్ డైరెక్టర్ మరో సంచలనానికి తెర లేపిన విషయం తెలిసిందే..ఇందులో కథానాయకులుగా మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ మరియు ‘నందమూరి తారక రామ రావు’ నటిస్తున్న విషయం తెలిసిందే..

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ ను సరికొత్తగా చూపించబోతున్నట్లు సమాచారం.

వాస్తవానికి ఈసినిమా కథ రీత్యా చరణ్ స్లిమ్ గా ఎప్పటిలాగే తన సహజమైన లుక్ తో కనిపిస్తే చాలు. అయితే ఈ సినిమాలో చెర్రీ లుక్ ను కూడా చాలా… డిఫరెంట్ గా చూపించాలి అన్న రాజమౌళి తపనతో చరణ్‌ హెయిర్‌ స్టయిల్‌ కోసం హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్‌ హకీమ్‌ తో చాల లోతైన చర్చలు రాజమౌళి చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్.

ఇక ‘ఎన్టీఆర్’ కి సైతం ఈ సినిమాలో గెడ్డంతో కనిపించే పాత్ర అని టాక్ రావడం… ఇప్పటివరకు ఆ విధమైన పాత్రలో తారక్ నటించకపోవడం వంటి విషయాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కలవరపాటు కి గురిచేస్తున్నాయి.

జక్కన్న ఏ ప్రాజెక్ట్ చేసిన చాలా జాగ్రత్తలు వహిస్తాడు,అలాంటిది ఇంత క్రేజ్ ఉన్న టాప్ హీరోలతో సినిమా చేస్తున్నాడంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..ఈ ముగ్గురి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి..

న్యూ లుక్ లో తమ అభిమాన హీరోలు ఎలా ఉండబోతున్నారు… న్యూ లుక్ వారికి సెట్ అవుతుందా లేదా అనే టెన్షన్ వారిలో ఉంది. కాకపోతే ఇద్దరు టాప్ అండ్ యంగ్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ..? ఎవరి పాత్రకు తక్కువ ప్రాధాన్యం ఉంటుంది అనేది మాత్రం ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.


Spread the love