ప్రేమ కథా చిత్రమ్ 2 ఫస్ట్ లుక్ రిలీజ్

Spread the love

మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ చిత్రం ఎంతటి ఘానా విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు.. ఫుల్ కామెడీ మరియు హారర్ ఎంటర్టైన్మెంట్ గ రూపుదిద్దుకున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబట్టింది..

ఇప్పుడు అదే తరహాలో సుమంత్ అశ్విన్ మరియు నందిత శ్వేతా జంటగా హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతూ ప్రేమ కథ చిత్రం 2 అనే సినిమా ని సిద్ధం చేస్తున్నారు..

Prema katha chitram 2 movie first lokk release

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 . సుమంత్ అశ్విన్‌,సిద్ధి ఇన్నాని జంట‌గా న‌టిస్తున్నారు.

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా తెర‌కెక్కుతున్న‌ “ప్రేమ కథా చిత్రం 2” సినిమా మెద‌టిలుక్ ని విడుద‌ల చేసుకుంది.

సినిమా షూటింగ్ పూర్త‌యింది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వ‌స్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా న‌ట‌న సూయ‌ర్ ప్ల‌స్ అవుతుంది.


Spread the love