భారత ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

Spread the love

ఇప్పుడు భారతదేశ సినీ పరిశ్రమ ప్రముఖుల జీవితికథల ను తెరకెక్కించే పనుల్లో నిమగ్నమయ్యారు.టాలీవుడ్ ను సైతం తాకిన బయోపిక్ ట్రెండ్ మహానటి చిత్రం ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్ బయోపిక్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమయ్యారు వారి కుటుంబీకులు, అలాగే దివంగత మాజీ ముఖ్యమంత్రి , ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత కథ ను ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యాత్ర చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది .కోలీవుడ్ లో కూడా దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారి బయోపిక్ ను సిద్ధం చేస్తున్నారు

బాలీవుడ్ లో మాత్రం బయోపిక్ ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి కారణం బాలీవుడ్ లో బయోపిక్ లు ఘన విజయం సాధించడమే, ప్రస్తుతం క్రికెటర్ కపిల్ దేవ్, ఒకప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ల జీవిత కథలతో బిజీ గా ఉంది. అనూహ్యంగా మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై ఒక బయోపిక్‌ను తీసేందుకు సిద్ధమైంది బాలీవుడ్, నటుడు వివేక్ ఓబరాయ్ ఈ బయోపిక్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో నటిస్తున్నాడు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ‘పీఎం నరేంద్ర మోదీ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘పీఎం నరేంద్ర మోదీ’ టైటిల్‌తో పాటు ‘దేశభక్తే నా శక్తి అనేది ట్యాగ్‌లైన్‌గా పెట్టారు.‘మేరీకోమ్’, ‘సరబ్‌జీత్’ వంటి బయోపిక్ సినిమాలను తెరకెక్కించిన ఒమంగ్ కుమార్ ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు . తాజాగా ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్స్ వంటి సంచలనాత్మక నిర్ణయాలతో పాటు పెద్ద నోట్లు రద్దు, జీఎస్‌టీ‌ వంటి సంచలనాత్మక నిర్ణయాలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన అంశాలు ప్రధానంగా చేయిన్చాబోతున్నారని ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సినంత మసాలా ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఉంది మరియు అయిన జీవిత కథ ఆధారంగా దిగువ తరగతి కుటుంబంలో పుట్టి..రైల్వే స్టేషన్‌లో ‘టీ’ అమ్ముతూ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా…ఆపై దేశ ప్రధాన మంత్రిగా ఎదిగిన వైనం ఎందరికో ఆదర్శంగా నిలిచింది

ఇలా చాలా సంఘటనలు ఉండబోతున్నాయి అని విశ్లేషకుల సమాచారం ప్రధాని మోదీగా..వివేక్ ఓబరాయ్ లుక్ అదిరిపోయింది. వివేక్ ఓబరాయ్ ఆహార్యం మాములుగా చూస్తే నరేంద్ర మోదీ అనుకునేలా ఉంది. స్వష్టంగా చూస్తే కానీ..వివేక్ ఓబరాయ్‌ అని గుర్తించడం కష్టం. అంతలా వివేక్ ఒబెయ్ రాయ్ లుక్ ప్రధాని మోదీ పాత్రలో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు చిత్ర డైరెక్టర్ . ఈ బయోపిక్ ను హిందీ, తమిళం, గుజరాతి, ఉర్దు , తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు.


Spread the love