తండ్రి ఋణం తీర్చుకున్న తనయుడు అభిమానుల ఆనందం

Spread the love

మొత్తానికి నందమూరి అభిమానులకు ఈరోజు కన్నుల పండుగ అయిందనే చెప్పాలి. ఎప్పటినుండో ఎదురు చూస్తున్న చిత్రం ఈరోజు తెర మీదకి వచ్చింది.విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారకరామారావు పాత్ర లో తన తనయుడు నందమూరి నటసింహం బాలకృష్ణ సరిగ్గా సరిపోయాడనే చెప్తున్నారు ఫ్యాన్స్. అందరు అనుకున్నట్లే క్రిష్ చిత్రాన్ని ఎటువంటి కాంట్రవర్సిస్ లేకుండానే చిత్రాన్ని నిర్మించాడు.

ఎక్కడ బోర్ కొట్టించకుండా చాల చక్కగా దర్శకత్వం వహించాడని చిత్రాన్ని చూసిన వాళ్ళు చెప్తున్నారు.1984లో మద్రాస్‌లో బసవతారకం హాస్పిటల్‌లో ట్రీట్మెంట్‌తో ఈ సినిమా స్టార్ట్ అవుతోంది. ఎన్టీఆర్ గారు తన సినీ రంగం లో మరియు జీవితం లో ఎలా ఎదిగాడు అనేది ఫస్ట్ హాఫ్ లో చూపించినట్లు గా తెలుస్తుంది. ఎక్కడ చూసిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. బాలకృష్ణ తన తండ్రి పాత్ర లో నటించాలి అంటే అంత సులువు కాదు.

దాదాపు బాలకృష్ణ 63 పాత్రల్లో కనిపించాడని చెప్తున్నారు. క్రిష్ దర్శకత్వం, బాలకృష్ణ నటన, విద్యాబాలన్ నటన , కీరవాణి సంగీతం ఈ చిత్రం లో విశేషం గా నిలిచాయి అని ఫాన్స్ చెప్తున్నారు. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, సుమంత్ ఇంకా తదుపరి నటి నటులు తమ పాత్రలకి న్యాయం చేసారని చెప్తున్నారు.

సెకండ్ హాఫ్ లో చివరి అరగంట సినిమాలో క్రిష్ ఫాన్స్ కి ఉత్కంఠ రేపడని,క్లైమాక్స్ అదిరిపోయిందని చెప్తున్నారు. మొత్తానికి బాలయ్య బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఈ సంక్రాంతికి బద్దలు కొడతాడని అనిపిస్తుంది. విజయవంతం గా కథానాయకుడు తెరకెక్కించిన క్రిష్ రెండవ భాగం ఫిబ్రవరి లో విడుదల చేయబోతున్నాడు..


Spread the love