యన్.టి.ఆర్ బయోపిక్ లో బాలయ్యకి షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

Spread the love

నందమూరి బాలకృష్ణ స్వయం నిర్మాణం ఎన్‌బీకె ఫిలిమ్స్ బ్యానర్‌పై తన తండ్రి, దివంగత నటుడు, రాజకీయవేత్త నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా రూపంలో నిర్మించాడు, అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్ర రెండు భాగాలుగా నిర్మించారు , మొదటి భాగం సంక్రాంతి కి ముందుగా అంటే జనవరి 9న తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనుంది.

రెండొవ భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో అండ్ ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య డైరెక్టర్ క్రిష్‌తో, నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి మీడియాకి ఇంటర్వూలు ఇస్తున్నాడు .


మొదటిభాగం ‘కథానాయకుడు’ సెన్సార్ పూర్తి చేసుకుందని ఎలాంటి సెన్సార్ కత్తిరింపులు లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ వచ్చిందని సంతోషం లో చిత్రయూనిట్ పోస్టర్ ను విడుదల చేసారు, ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాలో చాలా మంది సినీ ప్రముఖులు తో పాటు నందమూరి కుటుంబ సభ్యులు నటిస్తున్నారు . ఈ సినిమాలో ఎన్టీఆర్ కు సతీమణి గా విద్యాబాలన్, హరికృష్ణ గా కళ్యాణ్ రామ్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పాత్రలో రానా తదితరులు ముఖ్యపాత్రలు పోషించడంతో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది .


Spread the love