నువ్వు మహారాజువి కాదు ఆకాశం నుండి ఊడిపడలేదు గుర్తుపెట్టుకో

Spread the love

నాగబాబు ఈ మధ్య సోషల్ మీడియా లో ఎక్కువగా కనిపిస్తున్నందుకు కారణం ఆయన బాలకృష్ణ మీద కౌంటర్ ల మీద కౌంటర్ లు వేస్తున్నాడు. అది మాములు కామెంట్స్ ఐతే బాగానే ఉండేది. కానీ ఒకే మనిషిని అన్ని సార్లు ఉద్దేశించి అనడం కూడా కరెక్ట్ కాదు. ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు. దీనితో నందమూరి అభిమానుల ఆవేశం కట్టలు తెంచుకుంది.

ఎప్పుడు ఎప్పుడు నాగబాబు దొరుకుతాడా అని ఎదురు చూసారు.చెన్నై వెల్ టెక్ కాలేజ్ ఈవెంట్ లో గెస్ట్ గా వెళ్లిన నాగబాబు కి నందమూరి ఫాన్స్ చుక్కలు చూపించారు. నాగబాబు తన స్పీచ్ మొదలు పెట్టగానే జై బాలయ్య జై బాలయ్య అంటూ, నాగబాబు డౌన్ డౌన్ అని తనని స్పీచ్ ఇవ్వకుండా చేసారు. దెబ్బకి నాగబాబు స్పీచ్ ఇవ్వకుండానే అక్కడనుండి వెళ్ళాడు. దీన్ని బట్టి నందమూరి అభిమానులు ఈ విషయాన్ని ఎంత హర్ట్ అయ్యారో అర్ధం అవుతుంది.

ఇదిలా ఉంటే నాగబాబు నందమూరి అభిమానులని ఉద్దేశించి ఒక వీడియో ని విడుదల చేశారు.. ఆ వీడియో లో తాను ఆలా ఎందుకు కౌంటర్ లు వేయాల్సి వచ్చిందో పూర్తిగా వివరించాడు.. నేను ఎవర్ని కావాలని ఇబ్బంది పెట్టను. ఆయన మాట్లాడింది నచ్చకే ఇలా కౌంటర్ లు వేయాల్సి వచ్చింది తప్ప ఇంకేం లేదు అని వీడియో లో వివరించాడు..


Spread the love