రెండవ మజిలీ మొదలు పెట్టిన చైతు, సమంత

Spread the love

అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం మజిలీ నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ జంట నటిస్తున్నారు ఈ సినిమాకి మజిలీ అనే టైటిల్ ని ఎంచుకున్నట్టు చిత్ర యూనిట్ తెలియజేసారు ఈ మజిలీ సినిమా కొన్ని రోజులుగా వైజాగ్ లో షూటింగ్ జరుగుతుంది..

ఇటీవలే అక్కడ్డ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చేసింది ఈ నెల 26 నుండి రెండవ షెడ్యూల్ నిహైద్రాబాద్ లో ప్రారంభించడానికి చిత్ర యూనిట్ అన్ని సిద్ధం చేసుకుంది ఈ సినిమా ఇప్పటికి 40% పూర్తి చేసుకుంది చైతు సమంత పెళ్లి తర్వాత చేస్తున్న మొదటి సినిమా కావడం తో ఈ సినిమాపై అభిమానులు బాగానే అంచనాలు పెట్టుకున్నారు.

దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. త‌ణికెళ్ళ భ‌ర‌ణి, రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు..

ఈ రొమాంటిక్ డ్రామాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాంశ కౌశిక్, రావు ర‌మేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌ణికెళ్ళ భ‌ర‌ణి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. కాగా రేపు (నవంబర్ 23) నాగ చైతన్య బర్త్ డే కావడంతో సర్ ప్రైజ్‌కి ప్లాన్ చేసింది చిత్రయూనిట్.


Spread the love