రాజన్న యాత్ర ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం

Spread the love

రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర మూవీ ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేసింది.. ఈ ట్రైలర్ ని చూస్తే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని చూసినట్టుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రైలర్ లో వచ్చే ఒక డైలాగ్ బాగా ఆకట్టుకుంది. “రాజశేఖర ఈ సారి నా ఓటు నీకే నీ పార్టీ కి కాదు” అనే డైలాగ్ చూస్తే అప్పటి కాలంలో రాజేశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులని గుర్తుకుతెస్తున్నాయి.

దివంగత మాజీ ముఖ్యమంత్రి , ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జీవిత కథ ను డైరెక్టర్ మహి వీ రాఘవ దర్శకత్వంలో శశిదేవిరెడ్డి, విజయ్ చిల్లా యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.గతం లో విడుదలైన టీజర్స్ కు మంచి స్పందన లభించింది. యాత్ర సినిమా ను ప్రారంభించినప్పటినుంచే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, తమ నాయకుడి జీవిత కథను ఎప్పుడు తెరపై చూద్దామ అని అలాగే ఆయన ప్రారంభించిన యాత్ర ను కనులార మరోసారి చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వేచి చూస్తున్నారు.

చిత్ర యూనిట్ కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంట వెంటనే యాత్ర కి సంభందించిన అన్ని వివరాలను ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఏదో ఒక రూపం లో ప్రేక్షకులకు దగ్గరయ్యే పని లో పడ్డారు.ఇప్పటికే యాత్ర సమార శంఖం, రాజన్న నిన్నుఅపగలరా అనే ప్రోమో వీడియో సాంగ్స్ ను విడుదల చేసారు . సాంగ్స్ కు విశేష స్పందన లభిస్తుంది. అయితే చిత్ర యూనిట్ ప్రేక్షకులకి మరో కనుక ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం యాత్ర సినిమా ట్రైలర్ ను విడుదల చేశారుv


Spread the love