మెహ‌న్‌లాల్ ‘ఓడియ‌న్’ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్

Spread the love

జనతా గ్యారేజ్ సినిమాతో తెలుగు ప్రజల అభిమానాన్ని ఇంకా ఎక్కువ సంపాదించిన నటుడు మోహన్ లాల్.. మోహన్ లాల్ కి మలయాళం లో ఎంత క్రేజ్ ఉందొ తెలుగు లో కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పొచ్చు ఎందుకంటె ఆయన ఎంచుకునే సినిమాలు అలా ఉంటాయి కాబట్టి, మెహ‌న్ లాల్ మలయాళం లో నటిస్తున్న అత్యంత భారీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ “ఓడియ‌న్”.

ఈ చిత్రానికి అక్క‌డే కాకుండా తెలుగు ట్రేడ్ లో కూడా చాలా మంచి క్రేజ్ వుంది. ఈ చిత్రం కోసం మెహ‌న్ లాల్ గారు యెగా మ‌రియు వ్యాయామాలు చేసి త‌న వ‌య‌సుని 55 సంవ‌త్స‌రాల నుండి 35 సంవ‌త్స‌రాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని న‌టించిన చిత్రం కావ‌టం.. అద్బుతమైన గ్రాఫిక్స్ తో నిర్మిస్తుండ‌టంతో ఈ క్రేజీ ప్రాజెక్టు కి సౌత్ ఇండియా అంతా హ్యూజ్ క్రేజ్ వ‌చ్చింది. టాలీవుడ్ లో ఎంతో మంది బడా నిర్మాతలు ఈ సినిమా హక్కుల కోసం ప్రత్నించిన ఫలితం లేకపోయింది.. కానీ దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన ద‌గ్గుపాటి అభిరామ్ గారు, సంప‌త్ కుమార్ గారు ఈ చిత్రం తెలుగు హ‌క్కులు పొంద‌టం విశేషం.

ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా స్టార్ డైరెక్టర్ వి వి వినాయక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ ను అభినందించారు. ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగులో డిసెంబర్ 14న గ్రాండ్ గా ఏక‌కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా కోసం మోహన్ లాల్ గారు యోగాసనాల వంటి ప్రక్రియలు 55 సంవత్సరాల వయస్సులో చేయడం హ్యాట్సాఫ్. పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ మెస్మరైజ్ చేస్తాయి. ఈ సినిమా హక్కులు మాకు ఇచ్చినందుకు మోహన్ లాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని దగ్గుబాటి ఫామిలీ తెలియజేసింది . మలయాళం తో పాటు తెలుగులోనూ ఏకకాలంలో డిసెంబర్ 14న అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నాం అని అన్నారు.


Spread the love