రామ్ చరణ్ వినయ విధేయ రామ మూవీ సాంగ్ ప్రోమో విడుదల చేసిన చిత్రబృందం

Spread the love

వినయ విధేయ రామ నుంచి మరో ప్రోమో సాంగ్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్
మెగాపవర్ స్టార్ నటించిన వినయ విధేయ రామ సినిమా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది, కాగా ఈ సినిమా కు సంబందించిన టీజర్ నుంచి ఇప్పటి వరకు విడుదలవుతున్న ప్రతి విషయం ఈ సినిమా పై మరింత ఆసక్తి పెంచుతుంది.

ఒక పక్క సంక్రాంతి పండుగకి మన టాలీవుడ్ నుంచి బాలయ్య సినిమా కథానాయకుడు , వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్ 2’ విడుదల కాబోతున్నాయి. వీటితో పాటు వినయ విధేయ రామ కూడా విడుదల కాబోతుంది.కావున ఎవరి సినిమా ప్రొమోషన్స్ లతో వారు బిజీ గా ఉన్నారు .తాజాగా వినయ విధేయ రామ నుంచి ‘రామ లవ్స్ సీత సీత లవ్స్ రామ ‘ అనే వీడియో సాంగ్ ప్రోమో ను విడుదల చేసారు చిత్ర యూనిట్ . ఈ వీడియో లో హీరో చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ దేవి శ్రీ బిట్స్ కు ఏ మాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేసారు .

ఈ వీడియో లో చుట్టూ భారీ సెట్టింగులు.. రంగురంగుల కాస్ట్యూమ్స్, చాలా మంది డాన్సర్ లు చూస్తుంటే సాంగే ఇంత గ్రాండ్ గా తీస్తే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అభిమానుల ఆశలు రెట్టింపు అవుతున్నాయి, ఏది ఏమైనా జనవరి 11 న సినిమా కోసం అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు .


Spread the love