ఆర్ ఆర్ ఆర్ సినిమా లో తారక్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన రాంచరణ్

Spread the love

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన సినిమా వినయ విధేయ రామ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు. పలు టీవీ చానెల్స్ కు ఇంటర్వ్యూ లు ఇస్తూ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిస్తూ మెగా అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నా పాత్ర రాజమౌళిగారు మళ్లీ డీ గ్లామరైజ్‌డ్ పాత్రను సృష్టించారు. ఈపాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచుస్తున్నాను.

రంగస్థలం చిత్రంలో చరణ్ డీ గ్లామరైజ్‌డ్ పాత్రలో తెలుగు ప్రేక్షకులని అలరించాడు, ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మళ్లీ డీ గ్లామరైజ్‌డ్ పాత్రలో నటించబోతున్నట్లుగా తెలిపాడు. అలాగే ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం తాను, తారక్ ఈ సినిమా కోసం సంవత్సరం మొత్తం కేటాయించామని వేరే చేయడానికి కూడా తాము అంగీకరించలేదని ఆర్ ఆర్ ఆర్ సినిమా అద్భుత‌మైన క‌థ‌తో `రాజ‌మౌళి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

నాకు, తారక్ కు ఒకేసారి క‌థ చెప్పారు. క‌థ పూర్త‌యిన తర్వాతే మమ్మ‌ల్ని ఫిక్స్ చేశారు, అంతేగాని నేను తారక్ దొరికమని రాజ‌మౌళి క‌థ అల్లేయ‌లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా గ్రాఫిక్స్ వ‌ర్క్ కోసం నేను, తారక్ అమెరికా వెళ్లాం అని తెలియజేసాడు. అలాగే నాన్నగారు అన్ని రకాల సినిమాలు చేశారు. నాకూ చేయాలనుంది. ‘రంగస్థలం’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలున్నాయి.

‘రంగస్థలం’ తర్వాత వినయ విధేయ రామ తో వస్తున్నా ఒత్తిడి అయితే ఉంటుంది కానీ ఒత్తిడికి లోనయితే, దర్శకులందరితో చేయలేం ప్రతిదీ రంగస్థలం ల అవ్వాలి అనుకుంటే వేరే దర్శకులతో తీయలేము అని అన్నారు..


Spread the love