వినయ విధేయుడు మెప్పించలేకపోయాడు చరణ్ రివ్యూ

Spread the love

మెగా పవర్ స్టార్ రాంచరణ్ వన్ మాన్ షో గా వినయ విధేయ రామ రూపుదిద్దుకుంది.సినిమాలో చరణ్ ర్యాంబో లుక్ చూపించిన తీరు బాగుంది. ఈ చిత్రం అంత రాంచరణ్ తన విశ్వరూపాన్ని మరోసారి చూపించాడు.ఈ సినిమాలో రాంచరణ్ నటన, యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు, రంగస్థలం తర్వాత రాం చరణ్ లో కొత్త నటుడిని చూపించడానికి బోయపాటి చేసిన ప్రయత్నం అందరిని ఆకట్టుకుందని చెప్పాలి .

వినయ విధేయ రామలో కూడా చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. చరణ్ లోని మాస్ యాంగిల్స్ బాగా ఎలివేట్ అయ్యేలా చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. హీరోయిన్ గా కియరా తక్కువ సన్నివేశాల్లో ఉన్నా తన నటనతో అందచందాలతో ఓకే అనిపించింది..ఐదుగురు అన్నదమ్ములు ఉన్న అందమైన ఫ్యామిలీలో అందరి కన్నా చిన్నవాడైన రాంచరణ్ అంటే అందరికి ఇష్టం. మిగతా అన్నలు వదినలు పరిధి మేరకు నటించారు. ఆర్యన్ రాజేష్ కు సినిమా లో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించింది ఇలాంటి మంచి కుటుంబం లో అనుకోకుండా విలన్ తో రాంచరణ్ పెద్ద అన్న అయిన ప్రశాంత్ కు వివేక్ ఓబేరాయ్ కు మధ్య గొడవలు మొదలవుతాయి.

విలన్ వివేక్ ఓబేరాయ్ రాంచరణ్ అన్నాను హతమారుస్తాడు, రాంచరణ్ వివేక్ ఓబేరాయ్ ను ఎలా ఎదురుకున్నాడు అనే విధానం లో బోయపాటి మార్క్ స్వష్టంగా కనపడుతుంది. ప్రశాంత్ కు తగ్గ పాత్ర ను అందించడంలో బోయపాటి నిరాశపరిచాడు అనే అనిపిస్తుంది సగటు ప్రేక్షకుడికి . విలన్ గా వివేక్ తన నటనతో మెప్పించాడు, మెప్పించడం కంటే అదరగొట్టాడు అనే చెప్పాలి. చరణ్ డ్యాన్స్ తో కవర్ చేశాడే తప్ప డిఎస్పి సంగీతం నిరాశపరిచాడు .దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అనుకున్నంత పెద్దగా మెప్పించలేకపోయాడు అనే చెప్పాలి బిజిఎం పర్వాలేదనిపించారు.

ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ దిశగా సాగుతుంది.. ఇంటర్వల్ కు ప్రాధాన్యత ఇచ్చారు అదిరిపోయే సన్నివేశాలు ఇంటర్వల్ లో ప్రధానంగా ఆకట్టుకుంటాయి . సెకండ్ హాఫ్ కాస్త వైలెంట్ కు ప్రాధాన్యం ఇచ్చారు .కథలో పెద్దాగా ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడం కాస్త వయిలెన్స్ కూడా ఎక్కువవడం లాంటివి సాధారణ ఆడియెన్స్ కు రుచించకపోవచ్చు . ఫైనల్ గా వివి ఆర్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కు మెగా మాస్ సినిమా ఇచ్చాడు బోయపాటి. సంక్రాంతి హాలిడేస్ కాబట్టి వసూళ్లు రాబడుతాయి అని మెగా ఫాన్స్ ఆశిస్తున్నారు.


Spread the love