నేను కూడా అది తెలుసుకుందామనే ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్నాను

Spread the love

నందమూరి అభిమానులకు మరియు మెగా అభిమానులకు ఎప్పుడు ఎదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ టీడీపీ నుండి వేరు అయ్యాక ఇంకా ఎక్కువయ్యింది . సోషల్ మీడియా లో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు ఎదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. కానీ రామ్ చరణ్ , ఎన్టీఆర్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా వారు మంచి స్నేహం తోనే ఉంటారు.

రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఇద్దరు ఎపుడు ఒకే చోట కనిపిస్తున్నారు. ఒక పక్క బాబాయ్ లు ఇద్దరు ఒకరి వాదన తో ఒకరు పోటీపడుతుంటే ఈ ఇద్దరు తెలివితో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు.రీసెంట్ గా ఒక షో లో రామ్ చరణ్ ని ఎన్టీఆర్ బయోపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి అని అడగగానే ఐ రెస్పెక్ట్ ఎన్టీఆర్ అంటూ సమాధానం ఇచ్చాడు.

నేను కూడా ఎన్టీఆర్ బయోపిక్ ని తెర మీద చూడాలని ఎప్పటి నుండో వేచి చూస్తున్నాను అని చెప్పారు. మెగా హీరో లతో ఇది రెండవ సినిమా బోయపాటికి. పాటలు మరియు ట్రైలర్ అభిమానుల అంచనాలు మించిపోయాయనే చెప్పవచ్చు..


Spread the love