చెర్రీ కోసం కొత్త సందడి మొదలు పెట్టిన మెగా అభిమానులు

Spread the love

సినీ నటులకు అభిమానులు వుండటం సహజం కానీ మెగా ఫ్యామిలీ కి అభిమానుల కొరత లేదు.. మెగా స్టార్ చిరంజీవి నుండి నేటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరకూ మెగా అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. రామ్ చరణ్ కి ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే, ఇప్పుడు రామ్ చరణ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు..

సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన రంగస్థలం వంటి భారీ విజయం తర్వాత రామ్ చరణ్ నటించిన మరో చిత్రం వినయ విధేయ రామ ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు.. ఇంతటి అభిమాన సంద్రం వున్నా రామ్ చరణ్ సినిమాలు విజయాలు సాధిస్తున్నాయంటే వాటిలో మెగా అభిమానుల పాత్ర చాలానే వుంది.

అయితే సంక్రాంతి బరిలో ఉన్న రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్స్ కోసం మెగా అభిమానులు ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారు..వినూత్న రీతిలో బైక్ ర్యాలీ చేసి సినిమా ప్రచారం చేపట్టబోతున్నారు. బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న వినయ విధేయ రాముడైన రామ్ చరణ్ కోసం అఖిల భారత చిరంజీవి యువత, కడప జిల్లా చిరంజీవి యువత కలిసి డిసెంబర్ 6వ తేదీన బైక్ ర్యాలీ చేయబోతోంది.

ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన అందాల తార కియారా అద్వానీ జంటగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మెగా అభిమానులని ఉర్రుతలూగిస్తుంది.ఈ బైక్ ర్యాలీతో వినయ విధేయ రామ సినిమాకి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ని అందించబోతున్నారు మన మెగా అభిమానులు..


Spread the love