జనసేన ఆఫీస్‌లో క్లీనింగ్ పని చేసేందుకు కూడా నేను సిద్ధం : నాగబాబు

Spread the love

నేడు జనసేన పార్టీ లో పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు చేరిన సంగతి మనకు తెలిసిందే. గత కొంత కాలంగా తన తమ్ముడి పార్టీ ని పక్కన పెట్టి ఇతర పార్టీలను విమర్శిస్తున్నప్పుడే అందరికి ఒక అనుమానం వచ్చింది. జనసేన లో చేరడానికి ఇవన్నీ చేస్తున్నాడని అందరికి క్లియర్ గా అర్ధం అయిపోయింది. నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి నాగబాబు బరిలోకి దిగుతున్నాడని ఒక క్లారిటీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. గతం లో ప్రజారాజ్యం నుండి పోటీ చెయ్యాలని అనుకున్న కొన్ని కారణాల వలన పోటీ చెయ్యలేకపోయాడు. ఇప్పుడు జనసేన పార్టీ లో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆ ప్రాంతం లో గెలవాలంటే అంత సులువు కాదు. అక్కడ టీడీపీ కి మరియు వైసీపీ కి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. మరి నాగబాబు ఏ విధంగా రాణిస్తాడో చూడాలి.

‘‘కొన్ని మాటలు మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ, పవన్ చిన్నప్పుడు చాలా క్యూట్‌గా ఉండేవాడు. అలాంటి వాడు ఇలా ఎవాల్వ్ అవుతూ ఒక గ్రేట్ లీడర్ స్థాయికి ఎదగడం చూసి మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. కల్యాణ్‌ నాతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదు.. నా ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు. తమ్ముడు అన్న విషయం పక్కనపెడితే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్. చిన్నప్పటి నుంచి ఒక పులిలా ఉండేవాడు. ఎవరి జోలికి వెళ్లేవాడు కాదు.. తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడు. తొలుత నన్ను రమ్మని పిలిచినప్పుడు నేను నమ్మలేదు.. ఆ తర్వాత కొంత టెన్షన్ కూడా వచ్చింది. వయస్సు పరంగా తమ్ముడు కానీ.. మీలాగే నాకు పవన్ కల్యాణ్ నాయకుడు. పార్టీలో చేరకముందే నేను జనసేన కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాను.. ఆఖరికి ఆఫీస్‌లో క్లీనింగ్ పని చేసేందుకు కూడా మానసికంగా సిద్ధపడ్డాను. కానీ నాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు తమ్ముడిని ఆదర్శంగా తీసుకొని నా సత్తాను కచ్చితంగా నిరూపించుకుంటాను’’ అని నాగబాబు అన్నారు.


Spread the love