అలా జరిగినందుకు బాధపడుతున్నాను తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి

Spread the love

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వివాహం ఇటీవల అంగ రంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.. ఆ వివాహ మహోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేశారు.. అయితే ప్రియాంక చోప్రా అంటే నాకు ఇష్టం లేదని ది కట్ రైటర్ మరియా స్మిత్ పేర్కొంది.. ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌ల ప్రేమ నిజమైందేనా? అనే టైటిల్‌తో మారియా స్మిత్‌ ‘ద కట్‌’ వెబ్‌సైట్‌లో కథనం కూడా రాసి వివాదాస్పందంగా మారింది.

‘నిక్‌.. వీలైనంత తొందరగా ప్రియాంకతో తెగదెంపులు చేసుకో’ అంటూ తాను ఇటీవల ఒక కథనం రాసింది. ఆ తర్వాత ప్రియాంక రేసిస్ట్‌, సెక్సిస్ట్‌, గ్లోబల్‌ స్కామ్‌ ఆర్టిస్ట్‌ అంటూ మరియా అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఇది చూసిన ప్రియాంక అభిమానుల నుండి విమర్శలకు గురైంది.నిజానికి జాత్యహంకారం, జినోఫోబియా వంటి వాటిని నేను సహించను. నేను రాసిన కథనానికి పూర్తి బాధ్యత నాదే.

నిజంగా నేను తప్పు చేశాను. క్షమించండి’ అంటూ ద కట్‌ రైటర్‌ మారియా స్మిత్‌ ప్రియాంక, నిక్‌ దంపతులను ట్విటర్‌ వేదికగా క్షమాపణ కోరారు. ఇదిలా ఉండగా మారియా కథనాన్ని తొలగించిన ద కట్‌ యాజమాన్యం ప్రియానిక్‌లను ట్విట్టర్ వేదికగా క్షమాపణ కోరింది. అయితే మొదట తానేమీ అందరికీ వినోదం పంచేందుకు ఇలాంటి కథనాలు రాయలేదన్న మారియా తాజాగా ఈరోజు క్షమాపణలు కోరారు. దీనిపై ప్రియానిక్ లు ఎలా స్పందిస్తారో చూడాలి..

Mariah Smith Apologize To Bolywood Actress Priyanka Chopra and Nick Jonas


Spread the love