చెర్రీ కోసం అంత.. మహేష్ కోసం ఇంతేనా..!

Spread the love

రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సఫీస్ ని కొల్లగొట్టింది.. మొదట్లో రంగస్థలం సినిమాని చాల వరకు గోదావరి దగ్గర రాజమండ్రి పరిసరాలలో చిత్రీకరించారు కానీ రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి అక్కడ చిత్రీకరణ సాధ్యం కాలేదు..

ఇక అక్కడ చిత్రీకరణ సాధ్యం కాదని భావించిన సుకుమార్ హైదరాబాద్ లో 12 కోట్లలో ఒక పల్లెటూరి వాతావరణాన్ని నిర్మించాడు.. ఆ తర్వాత రంగస్థలం సినిమా మొత్తం అక్కడే చిత్రీకరించారు.. ఇప్పుడు తాజాగా వంశి పైడిపల్లి దర్శకత్వం లో మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి.. ఈ సినిమాలో మహేష్ బాబు విభిన్న పాత్రలలో కనువిందు చేయబోతున్నాడు..

మహేష్ బాబు ఈ సినిమాలో ఒక పల్లెటూరి కుర్రాడిలా కూడా నటించబోతున్నాడు అయితే ఈ సినిమాని కూడా ఏపీ లోని రక రకాల పల్లెటూర్లలో చిత్రీకరించాలని భావించారు కానీ మహేష్ కి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కనుక చిత్రీకరణ కష్టం అవుతుందని ఈ సినిమా పల్లెటూరి సెట్ ని హైదరాబాద్ లోనే 8 కోట్లలో ఒక పల్లెటూరి సెట్ ని రెడీ చేశారట చిత్ర బృందం..

ఈ సినిమాకి సంభందించి పల్లెటూరి చిత్రీకరణ ఈ సినిమాలో చాల కీలకం కానున్నాయి.. అందుకే దిల్ రాజు, పీవీపీ లు ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.. అప్పట్లో రంగస్థలం సినిమా పల్లెటూరి సెట్ కి 12 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు మహేష్ నటిస్తున్న మహర్హి సినిమాకి 8 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు..


Spread the love