అంచనాలను పెంచేస్తున్న మహర్షి “ఛోటి ఛోటి బాతే” సాంగ్

Spread the love

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, వంశి పైడిపల్లి దర్శకత్వం లో భారీ అంచనాలతో వస్తున్న చిత్రం మహర్షి. మహర్షి చిత్రం లో పూజా హెగ్దే మహేష్ సరసన నటించింది. మహేష్ స్నేహితుడి పాత్రలో ‘అల్లరి’ నరేష్ నటిస్తున్నారు. మహేష్ 25వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ చిత్రం మీద అంచనాలను పెంచేందుకు ఈ చిత్రం లోని ఒక పాటను విడుదల చేసారు. ‘ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే..’ సాంగ్ ను నేడు రిలీజ్ చేసారు. ప్రాణ స్నేహితులైన మహేష్, పూజా, అల్లరి నరేష్ స్నేహాన్ని వర్ణిస్తున్న ఈ సాంగ్ మహేష్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సాంగ్ ను అందించారు. ఈ సాంగ్ ను బట్టి ఈ చిత్రం యూత్ ను ఎక్కువగా ఆకర్షింప చేసేలా ఉందని చెప్పవచ్చు.


Spread the love