హైదరాబాద్ రాబోతున్న “అమ్మ”

Spread the love

వివాహం కూడా చేసుకోకుండా కేవలం తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేసిన ఘనత అమ్మ జయలలితదే. తమిళనాడు లో ఐదు సార్లు ముఖ్యమంత్రి గా చేసి దేశం లోని ప్రతి ఆడపిల్ల కి ఆదర్శం గా నిలిచింది. తమిళనాడు ప్రజలు వారికి నచ్చితే మనుషులకి కూడా దేవాలయాలు కడతారు. ఆ విధంగానే అమ్మ జయలలిత ని అభిమానించారు కాబట్టే ఆమెని ఐదు సార్లు ముఖ్య మంత్రి గా ఎన్నుకున్నారు.

ఈ మధ్య సినీరంగం లో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. అదే తరుణం లో ఈరోజు నందమూరి తారక రామారావు గారి బయోపిక్ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతోంది. జయలలిత గారి బయోపిక్ కి కూడా మొత్తం సిద్ధం అయ్యింది. ప్రియదర్శిని దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ది ఐరన్‌ లేడీ’ బయోపిక్‌ షూటింగ్‌ వచ్చే నెల 24వ తేదీన ప్రారంభం కానుంది. ఐతే అమ్మ చిత్రం కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో మొత్తం సెట్ రెడీ చేశారు.

జయలలిత గారి జీవితం లో జరిగిన అనేక యదార్ధ సంఘటనలు పరిశీలించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆమె సినీ మరియు రాజకీయాల్లో ఈ విధం గా రాణించారు అనే దాని మీద ఈ కధ నీ ఏర్పాటు చేసారని చెప్పారు. జయలలిత గారి పాత్రలో నిత్యా మీనన్ నటించబోతుంది. ఈ చిత్ర బృందం వారు ఒక పోస్టర్ ని విడుదల చేసారు. ఆ పోస్టర్ లో నిత్యా మీనన్ జయలలిత గారి లానే ఉందని అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Spread the love