తెలంగాణాలో అధికారం ఎవరిదో తేల్చేసిన లగడపాటి రాజగోపాల్

Spread the love

తెలంగాణా లో ఎన్నికలు ముగిశాయి. ఎవరికి వారు మేము గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అందరికి షాక్ ఇచేలా లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రకారం తెలంగాణ ప్రజలు మహాకూటమి వైపే వున్నారని ఇటీవలే ప్రకటించారు. ఈరోజు ఎన్నికలు ముగియడంతో పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.

అధికార పార్టీ అయిన తెరాస కి షాక్ ఇచ్చేలా ఉందని అందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని లగడపాటి తన సర్వే ద్వారా తేల్చేశారు. తెలంగాణ ఫలితాలపై అందరి దృష్టి మారేలా టైమ్స్ నౌ సంస్థ ఒక సర్వే ని విడుదల చేసింది. అందులో తెలంగాణ ప్రజలు ఈసారి కూడా కెసిఆర్ కే పట్టం కడతారని అందరు భావించారు..

అయితే వీటన్నిటిని పటా పంచలు చేస్తూ లగడపాటి ప్రెస్ మీట్ ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టాడు. ఈసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అంటే మహాకూటమి వైపున మొగ్గుచూపుతున్నారని తేల్చేశాడు.. లగడపాటి సర్వే ప్రకారం ఎప్పుడు తన అంచనా తప్పలేదని ఈసారి తెలంగాణ లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరేస్తుందని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

లగడపాటి చెప్పిన సర్వే ఇలా ఉంది..

TRS -> 35 (+-) 10
Mahakutami -> 65 (+-) 10
MIM -> 6-7
CPM -> 1
BJP -> 7

 


Spread the love