కమెడియన్ తో ప్రేమ లో పడిన కీర్తి సురేష్ ?

Spread the love

అతి తక్కువ కాలం లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. మహానటి చిత్రం తో ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా మంచి పేరుంది ఈ భామకు. కీర్తి సురేష్ తల్లి ఎవరో కాదు ఆమె ఒకప్పటి హీరోయిన్ . గతంలో చిరంజీవి నటించిన ‘పున్నామినాగు’సినిమాతో నటించిన మేనక. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన కీర్తి సురేష్ మొదట మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక టాలీవుడ్ లో నేను శైలజ, నేను లోకల్ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచింది. ఇక ‘మహానటి’సినిమాతో కీర్తి సురేష్ ప్రేక్షకుల నుండి ఎటువంటి ప్రశంసలు అందుకుందో మనందరికీ తెలుసు. ఇక ట్రేండింగ్ లో వున్న హీరోయిన్స్ ఫై ఎప్పుడు ఎదో ఒక రూమర్లు వస్తూనే ఉంటాయి.

తాజాగా కీర్తి సురేష్ మీద ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. ఒక టాప్ కమెడియన్ తో చట్టాపట్టాలేసుకొని తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కీర్తి సురేష్ టైమ్ మాములుగా లేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మహానటి తరువాత కీర్తీ సురేష్ లైఫ్ యు టర్న్ తిరిగింది. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘దర్భార్’లో ఛాన్స్ కోట్టేసింది. ఎప్పటి నుంచో ఈ భామ ఓ తమిళ కమెడియన్‌తో ఎఫైర్ సాగిస్తుందిని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ న్యూస్ వైరల్ అయ్యింది.

ఈ రూమర్లకు కారణం కీర్తి సురేష్ కెరీర్ బిగినింగ్ లో ఆ కమెడియన్ ఎంతో సహాయం అందించాడట..ఆ కృతజ్ఞతతోనే అతనితో స్నేహం చేస్తుందట. వీరిమధ్య వున్న స్నేహ బంధం ప్రేమగా మారిందని సమాచారం. దీనికి కారణం కీర్తి సురేష్ ఎక్కడ షూటింగ్ కు వెళ్ళిన, తాను ఎక్కడికి వెళ్లిన అక్కడికి అతడు కూడా వస్తున్నాడట. దీంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ కీర్తీ సురేష్ ఇవేవీ పట్టించుకోకుండా అతనితో స్నేహన్నీ కొనసాగిస్తూనే వుంది.


Spread the love