ఓటు వేయగానే కె.సి.ఆర్ అక్కడికే ఎందుకెళ్ళాడు

Spread the love

సిద్ధిపేట జిల్లా చింతమడక లో ఓటు వేసిన తెరాస అధ్యక్షుడు కెసిఆర్. పోలింగ్ కేంద్రం నుండి సరాసరి ఫామ్ హౌస్ కి బయలుదేరబోతున్నాడు.తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద కు వచ్చి తన ఓటుని వినియోగించుకున్నారు. ఓటు వేసి పోలింగ్ కేంద్రం వద్ద మీడియా తో మాట్లాడి హుటాహుటిన తిరుగు ప్రయాణమయ్యాడు.

ఎన్నికల విషయంలో గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగిందని సాయంత్రానికి ప్రజా నిర్ణయం బయట పడనుందని మంచి ఫలితాలు వస్తాయని విజయం తమదే అని దీమా వ్యక్తం చేసారు. పోలింగ్ తెరాస కు చాలా అనుకూలం గా ఉందని ప్రత్యేకంగా వృద్దులు ఓటు వేయడానికి తరలి వస్తున్నారని అన్నారు. హైదరాబాద్ లో ఓటింగ్ ఎక్కువమంది ఓటు వినియోగించుకుంటున్నారని మిగితా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా జనాలతో కిటకిటలాడుతున్నాయిని అన్నారు.

కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువకులు చాల ఉత్సాహం తో ఓటు వేయడానికి వస్తున్నారు. ఓటు ప్రజల బాధ్యత అని ఓటు ను సద్వినియోగం చేసుకోవాలని తద్వారా మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. మొన్నటి వరకు ప్రచార సభలతో బిజీ గా ఉన్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కు తీరిక సమయం దొరకడంతో తన స్నేహితులను కలవడానికి వెళ్తున్నట్లు చెప్పారు . గత 15 రోజులు గా తన స్నేహితులు తన కోసం ఎదురు చూస్తున్నారని వారితో కొద్ది సమయం గడిపి తిరిగి హెలికాప్టర్ లో తన ఫామ్ హౌస్ కు బయలుదేరుతారని సమాచారం.


Spread the love