కార్తికేయ నటించిన “హిప్పీ” టీజర్

Spread the love

ఆర్.ఎక్స్. 100 చిత్రం లో నటించిన కార్తికేయ మొదటి చిత్రం తోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత హిప్పీ చిత్రం లో హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ చిత్రం యొక్క టీజర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేసాడు. ఈ చిత్రం లో కార్తికేయ ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో దాన్ని పట్టుకున్నారు… అచ్చ తెలుగులో మిమ్మల్ని పచ్చి తిరుగుబోతని అంటారు తెలుసా అని వెన్నెల కిశోర్ చెప్పే డైలాగ్ తో ‘హిప్పీ’ టీజర్ మొదలయ్యింది. ఈ టీజర్ ను బట్టి ఈ చిత్రం లో కార్తికేయ బాక్సర్ లా కనిపించబోతున్నాడని అర్ధం అవుతుంది. ఒక ప్లే బాయ్ పాత్రను పోషించినట్లు అర్ధం అవుతుంది. కలైపులి ఎస్.తను… ‘వి.క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా టి.ఎన్.కృష్ణ డైరెక్ట్ చేసాడు. నివాస్ కె ప్రసన్న సంగీతం అందించిన ఈ చిత్రంలో కార్తికేయకు జోడీగా సూర్య వాన్షి, జాజ్బా సింగ్ హీరోయిన్లుగా నటించారు.


Spread the love