‘కాంచన-3’ మూవీ రివ్యూ

Spread the love

డాన్సర్ గా మంచి పేరున్న రాఘవ లారెన్స్ కాంచన సినిమాతో ఒక మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అప్పటినుండి హార్రర్ కామెడీ సినిమాలు చెయ్యడం లో దిట్ట అయ్యాడు. కాంచన చిత్రం తో మొదలు పెట్టి సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని బి.మధు నిర్మిస్తున్నారు. నేడు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసారు. ఈ చిత్రం లో లారెన్స్ సరసన వేదిక, నిక్కీ తంబోలి, ఓవియా హీరోయిన్ లుగా నటించారు. అతడి తల్లి పాత్రలో కోవై సరళ, వదినగా దేవదర్శిని నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

కథ విషయానికి వస్తే..

కాళీ (లారెన్స్) తల్లి రాధమ్మ అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని నడుపుతుంటుంది. ఆశ్రమంలోనే తన కొడుకు కాళీతో పాటు రోజీ అనే ఇంగ్లిష్ పిల్లను కూడా రాధమ్మ పెంచుతుంది. కాళీ తల్లి రాధమ్మ కు తమ బస్తి లో మంచి పేరుంది. ఒక రోజు కాళీ తల్లి రాధమ్మ అకాల మరణం చెందుతుంది. అప్పటినుండి తల్లి బాధ్యతలను చిన్నపిల్లాడైన కాళీ భుజానికెత్తుకుంటాడు. పెద్దయ్యాక ఓ కారణం వల్ల మినిస్టర్ శంకర్ తమ్ముడైన భవానీతో కాళీ గొడవ పడతాడు.

ఈ గొడవతో కాళీపై పగ పెంచుకున్న భవానీ.. కాళీ మనిషిని చంపిస్తాడు. అప్పటినుండి వీరిద్దరి మధ్య తీవ్రంగా గొడవలు అవుతాయి. ఆ తరువాత భవానీని చంపేస్తాడు. తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక మినిస్టర్ కాళీ నడిపే ట్రస్టును తగలబెట్టి కాళీని, రోజీని కూడా చంపిస్తాడు. ఇలా చనిపోయిన కాళీ, రోజీలు ప్రేతాత్మలుగా మారి రాఘవ (లారెన్స్) శరీరంలో ప్రవేశించి ప్రతీకారం తీర్చుకుంటారు.కాంచన చిత్రం మాదిరిగానే.. దెయ్యలంటే భయపడే యువకుడు రాఘవ పాత్రలో లారెన్స్ నటించాడు.

ఫస్టాప్‌లో కామెడీ, హారర్ ఉన్నప్పటికీ .. గత సినిమాలతో పోలిస్తే పెద్ద వైవిధ్యం లేదు.మిగతా సిరీస్‌ల మాదిరిగానే కాంచన-3 కూడా ఉండటం కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది. ఈ చిత్రం లో పాటలు ఆకట్టుకోలేక పోయాయి.

గత చిత్రాలతో పోలిస్తే కాంచన-3 అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు .

ప్లస్ పాయింట్స్ : లారెన్స్ నటన , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ : పాటలు , రొటీన్‌ స్టోరీ

రేటింగ్ : 2.5/5

 


Spread the love