హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది నేనే అంటున్న కె.ఏ.పాల్..

Spread the love

చంద్రబాబు కు గురువుని నేనే అంటున్న కెఏ పాల్ . చంద్రబాబు 1% తో గెలిచింది నేను క్యాంపైన్ చేసి దీవించడం వలనేనని చంద్ర బాబు మీద సంచలన వ్యాఖ్యలు చేసాడు.. ఈరోజున చంద్రబాబు కు మద్దతిస్తే దేవుడి కోపానికి గురవుతారని చెప్పారు.. పవన్ కళ్యాణ్ ఒక మీడియా లో మాట్లాడితే 5 నుంచి 10 వేల మందే చూసారని అదే మీడియా లో నేను బాలకృష్ణ గురించి మాట్లాడితే 14 లక్షల మంది చూసారని నా ఫాలోయింగ్ చూసి భీమవరం సభ కు అనుమతి ఇవ్వడంలేదని చంద్ర బాబు పై మండిపడ్డారు.

వైస్సార్, జనసేన సభలకు అనుమతిస్తున్నారు తన సభలకు అనుమతివ్వడం లేదని తన ఓటు బ్యాంకు చూసి చంద్రబాబు భయపడుతున్నారని తన ప్రతి సభ ను అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు. డిసెంబర్ 8 సాయంత్రం బంజార హిల్స్ లోని టీడీపీ ఆఫీస్ దగ్గర తాడో పేడో తేల్చుకుంటాం అన్నారు. అసలు హైదరాబాద్ అభివృద్ధి లో నా పాత్ర చాలా ఉంది చంద్ర బాబు ముఖ్య మంత్రి కాకముందే నేను హైదరాబాద్ ని అభివృద్ధి చేశానని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ప్రజలకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆగదు అని కుళ్ళు రాజకీయాలు చేస్తున్న చంద్ర బాబు ఆగడాలు ఇక సాగవు అని, జగన్ మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని జోస్యం చెప్పారు. ఆనాడు వైస్సార్ చనిపోయి రోశయ్య ముఖ్యమంత్రి అవుతారని ముందుగానే చెప్పాను అని గుర్తుచేశారు.

నటుడు నందమూరి బాలకృష్ణ పై వివాదాస్పద వాక్యాలు చేసి సంచలనానికి తెర లేపి మీడియా మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేసాడు. బాలకృష్ణ ఎవరో తనకు తెలీదని ఎప్పుడు కలవకపోవడం వల్ల బాలకృష్ణ నటుడు అన్న విషయం తనకు తెలీదని వివరణ ఇచ్చారు . ప్రజాశాంతి పార్టీ రాబోయే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయనుందని సమర్ధవంతమైన నాయకులని పార్టీ లోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు .రాబోయే ఆంధ్ర ఎన్నికల్లో కలిసి వస్తే వైస్సార్ , జనసేన తో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.


Spread the love